News February 24, 2025

అసంతృప్తికరంగా రేవంత్ పాలన: కిషన్ రెడ్డి

image

TG: రాష్ట్రంలో 14 నెలల రేవంత్ ప్రభుత్వ పాలన అసంతృప్తిగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సీఎంకు ఆయన బహిరంగ లేఖ రాశారు. డీఏలు, జీపీఎఫ్, పెండింగ్ బకాయిలు చెల్లించకుండా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను రోడ్డున పడేస్తారా అని ప్రశ్నించారు. ఉద్యోగులకు రొటీన్‌గా చెల్లించాల్సిన బిల్లుల్లో సీలింగ్ పెట్టడం దారుణమన్నారు. కళాశాలల యాజమాన్యాల పట్ల సీఎం తీరు బాగాలేదన్నారు.

Similar News

News March 19, 2025

ఐమాక్స్ ఫార్మాట్‌లో.. మోహన్‌ లాల్ చిత్రం

image

మోహన్‌లాల్ హీరోగా ప్రుథ్వీ రాజ్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎల్ 2 ఎంపురాన్’. లూసిఫర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ మూవీని మార్చి 27న ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో మలయాళంలో ఐమాక్స్ ఫార్మాట్‌లో వస్తున్న తొలి చిత్రంగా ‘ఎల్ 2 ఎంపురాన్’ రికార్డు సృష్టించింది. ‘ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయటం సంతోషంగా ఉందని’ ప్రుథ్యీరాజ్ Xలో పోస్ట్ చేశారు.

News March 19, 2025

సునీతా విలియమ్స్ కోసం ప్రత్యేక పూజలు

image

సునీతా విలియమ్స్ క్షేమంగా భూమిమీదకు చేరుకోవాలని గుజరాత్‌లోని ఝాలసన్‌లో ఆమె పూర్వీకులు పూజలు నిర్వహించారు. సునీతా భూమి మీదకు రాకకోసం కుటుంబమంతా ఎదురుచూస్తుందని తన సోదరుడు తెలిపారు. ఆమె క్షేమంగా చేరుకోవాలని ప్రత్యేకంగా యజ్ఞం చేశామన్నారు. భారత్ సంతతికి చెందిన సునీతా విలియమ్స్ గతేడాది అంతరిక్షంలో చిక్కుకుంది. 9నెలల తర్వాత నేడు వ్యోమనౌకలో భూమి మీదకు రానుంది.

News March 19, 2025

చిరంజీవికి ముద్దు పెట్టిన మహిళా అభిమాని

image

మెగాస్టార్ చిరంజీవికి ఓ మహిళ ముద్దుపెట్టిన ఫొటో వైరలవుతోంది. రేపు UK పార్లమెంట్‌లో లైఫ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడానికి ఆయన లండన్ చేరుకున్నారు. అక్కడి ఎయిర్‌పోర్టులో మెగాస్టార్‌‌కు ఘనస్వాగతం లభించగా, ఓ మహిళా అభిమాని ఆయన బుగ్గపై ముద్దు పెట్టారు. కాగా, ‘చిన్నప్పుడు చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లాలని అల్లరి చేసిన నేనే, మా అమ్మను చిరంజీవి దగ్గరకు తీసుకెళ్లా’ అని ఆ అభిమాని కొడుకు ట్వీట్ చేశారు.

error: Content is protected !!