News February 24, 2025

WFH.. ఇక ఉండదా?

image

కరోనా టైంలో ఎక్కువగా వినిపించిన పేరు వర్క్ ఫ్రం హోం(WFH). కొన్ని కీలక రంగాలు తప్ప చాలా మంది ఉద్యోగులు ఈ విధానంలో పనిచేశారు. ఇప్పుడు అంతా రివర్స్ అయ్యింది. చాలా కంపెనీలు WFH మోడ్‌ను ఎత్తివేస్తూ, ఉద్యోగులంతా ఆఫీసులకు వచ్చి పనిచేయాలని స్పష్టం చేస్తున్నాయి. దీంతో దేశంలో WFH పూర్తిగా ఉండదా? హైబ్రిడ్ మోడల్ ఉద్యోగాలు ఉంటాయా? అనే చర్చ మొదలైంది. WFH ఉద్యోగాలపై మీ అభిప్రాయం ఏంటి?

Similar News

News February 25, 2025

దుర్మార్గుడు.. ఐదుగురిని హత్య చేశాడు

image

కేరళలోని తిరువనంతపురంలో 23 ఏళ్ల అఫన్ అనే యువకుడు కొన్ని గంటల వ్యవధిలోనే ఐదుగురిని హత్య చేశాడు. వీరిలో తన తమ్ముడు, నానమ్మ, ఆంటీ, అంకుల్‌తో పాటు ప్రియురాలు కూడా ఉంది. ఆ దుర్మార్గుడు తల్లిపైనా దాడి చేయగా ఆమె ఆసుపత్రిలో చావుతో పోరాడుతోంది. హత్యల అనంతరం నేరుగా వెళ్లి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. తానూ విషం తాగానని చెప్పడంతో షాకైన పోలీసులు అతడిని ఆసుపత్రిలో చేర్చారు. హత్యలకు కారణాలపై విచారిస్తున్నారు.

News February 25, 2025

ఈ సింగర్ ఇద్దరు స్టార్ హీరోల చెల్లెలు తెలుసా?

image

సింగర్ బృంద.. తమిళ స్టార్ హీరోలు సూర్య, కార్తీల సొంత చెల్లెలు. మిస్టర్ చంద్రమౌళి మూవీతో సింగర్‌గా కెరీర్ ఆరంభించిన ఆమె తర్వాత రాక్షసి, జాక్‌పాట్, పొన్‌మగల్ వంధాల్‌, ఓ2లో పాటలు పాడారు. తన వదిన, సూర్య భార్య జ్యోతిక నటించిన పొన్‌మగల్ వంధాల్‌లో బృంద పాడిన ‘వా చెల్లామ్’ సాంగ్ పెద్ద హిట్టయింది. ఇక రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన ‘బ్రహ్మాస్త్ర’ తమిళ వెర్షన్‌లో ఆలియాకు ఈమే డబ్బింగ్ చెప్పారు.

News February 25, 2025

హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

image

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.

error: Content is protected !!