News February 25, 2025
హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.
Similar News
News March 20, 2025
ఓవర్ థింకింగ్ వేధిస్తోందా..? ఈ టిప్స్ పాటించండి

ఓవర్‌థింకింగ్‌కు ప్రధాన కారణం నెగిటివిటీ కనుక దానికి దూరంగా ఉండండి. మన నియంత్రణలో లేని విషయాల గురించి ఆలోచించడం మానేయండి. మిమ్మల్ని ఏ విషయమైన ఇబ్బంది పెడితే 72 గంటల పాటు దాన్ని మర్చిపోండి. తర్వాత అది మిమ్మల్ని అంతగా వేధించదు. సోషల్ మీడియా అధికంగా వాడటం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కనుక దానికి దూరంగా ఉండండి. ధ్యానం చేయడంతో కంగారు తగ్గడంతో పాటు వాస్తవ పరిస్థితులని అర్థం చేసుకుంటారు.
News March 20, 2025
6 నెలల్లోపు పెట్రోల్ వాహనాల ధరకే EVలు: నితిన్ గడ్కరీ

వచ్చే 6 నెలల్లోపు EVల ధర పెట్రోల్ వాహనాలకు సమానం అవుతుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. దేశాన్ని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు మౌలిక సదుపాయాల రంగాన్ని మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. మంచి రహదారులను నిర్మించడం ద్వారా వస్తువుల రవాణా ఖర్చును తగ్గించవచ్చని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల నిర్మాణంతో పాటు స్మార్ట్ ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు.
News March 20, 2025
మార్చి 20: చరిత్రలో ఈరోజు

*1351: మహ్మద్ బిన్ తుగ్లక్ మరణం
*1951: భారత్ మాజీ క్రికెటర్ మదన్ లాల్ జననం
*1980: టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ జననం
*1986: హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ జననం
*2008: సినీ నటుడు శోభన్ బాబు మరణం
* అంతర్జాతీయ సంతోష దినోత్సవం
* ప్రపంచ పిచ్చుకల దినోత్సవం