News February 25, 2025
హతవిధీ.. పాకిస్థాన్‌కు ఘోర అవమానం..!

ఛాంపియన్స్ ట్రోఫీ ఆరంభించిన 6 రోజుల్లోనే అతిథ్య పాకిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, న్యూజిలాండ్‌పై వరుస ఓటములతో ఆ జట్టు మరో మ్యాచ్ ఉండగానే సెమీస్ రేస్ నుంచి తప్పుకుంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఆ దేశంలో ఓ ICC టోర్నీ జరుగుతోంది. కానీ ఆ ఆనందాన్ని ఆరు రోజులు కూడా ఆ దేశం నిలుపుకోలేకపోయింది. ఈ నెల 27న బంగ్లాదేశ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. పాక్ ప్రదర్శనపై మీ కామెంట్.
Similar News
News February 25, 2025
కోల్‌కతా, భువనేశ్వర్ సమీపంలో భూకంపం

కోల్‌కతా, ఒడిశాలోని భువనేశ్వర్ సమీపంలోని బంగాళాఖాతంలో భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై 5.1గా భూకంప తీవ్రత నమోదైంది. కోల్‌కతాతో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. భూకంపం వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదు. ఒడిశాకు 175కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించగా, దీని ప్రభావం బంగ్లాదేశ్‌లోనూ కనిపించింది.
News February 25, 2025
నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ

TG: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీలో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీ సెట్ దరఖాస్తుల ప్రక్రియ ఇవాళ సాయంత్రం నుంచి ప్రారంభం కానుంది. ఏప్రిల్ 4 వరకు దరఖాస్తులు స్వీకరించనుండగా ఏప్రిల్ 6, 7, 8 తేదీల్లో పొరపాట్ల సవరణకు అవకాశమిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు అప్లికేషన్ ఫీజు రూ.500, ఇతరులకు రూ.900గా నిర్ణయించారు. ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు పరీక్షలు జరగనున్నాయి.
వెబ్‌సైట్: https://eapcet.tgche.ac.in/
News February 25, 2025
నేటి నుంచి వైన్ షాపులు బంద్

TG: గ్రాడ్యుయేట్, టీచర్ MLC ఎన్నికల సందర్భంగా పలు జిల్లాల్లో నేటి నుంచి మద్యం అమ్మకాలు నిలిచిపోనున్నాయి. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటళ్లలోని బార్లు, కల్లు దుకాణాలు బంద్ కానున్నాయి. ఉమ్మడి మెదక్, NZB, ADB, కరీంనగర్, వరంగల్, NLG, ఖమ్మం జిల్లాల్లో ఇది వర్తించనుంది. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరించారు.