News March 21, 2024

9 సార్లు విచారణకు డుమ్మా

image

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేతలకు ఈడీ వరుస షాకులిచ్చింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను గతేడాది విచారించింది. ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. 9 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టేసింది.

Similar News

News July 8, 2024

శ్రీలంక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య

image

శ్రీలంక క్రికెట్ టీమ్‌కు తాత్కాలిక హెడ్ కోచ్‌గా సనత్ జయసూర్య నియమితులయ్యారు. ఇప్పటినుంచి సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌ పర్యటన వరకూ ఆయన కోచ్‌గా కొనసాగుతారని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇప్పటివరకు ఆయన ఆ జట్టుకు ఫుల్ టైమ్ క్రికెట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు. శ్రీలంకకు 445 ODI, 110 టెస్టులు, 31 T20ల్లో ప్రాతినిధ్యం వహించిన ఆయన మొత్తం 21,032 రన్స్ చేశారు. ఇందులో 42 సెంచరీలున్నాయి.

News July 8, 2024

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

image

BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్‌షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.

News July 8, 2024

మణిపుర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.