News March 21, 2024
9 సార్లు విచారణకు డుమ్మా
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆప్ నేతలకు ఈడీ వరుస షాకులిచ్చింది. ఇప్పటికే మాజీ డిప్యూటీ CM మనీశ్ సిసోడియా, ఎంపీ సంజయ్ సింగ్ జైల్లో ఉన్నారు. ఈ కేసులో సీబీఐ కేజ్రీవాల్‌ను గతేడాది విచారించింది. ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. 9 సార్లు సమన్లు జారీ చేసినా కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరుకాలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను నేడు హైకోర్టు కొట్టేసింది.
Similar News
News September 19, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News September 19, 2024
J&K తొలి విడత ఎన్నికలు.. 59 శాతం పోలింగ్ నమోదు
పదేళ్ల తర్వాత జరుగుతున్న జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. దాదాపు 59శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కిశ్త్‌వాడ్‌లో అత్యధికంగా 77శాతం, పుల్వామాలో అత్యల్పంగా 46శాతం పోలింగ్ నమోదైందని తెలిపారు. ఎక్కడా రీపోలింగ్ నిర్వహించాల్సిన అవసరం లేదన్నారు. J&Kలో 90 స్థానాలుండగా ఫస్ట్ పేజ్‌లో 7 జిల్లాల్లోని 24 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది.
News September 19, 2024
‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు
AP: గత ప్రభుత్వ హయాంలో అమలైన మరో పథకం పేరును కూటమి ప్రభుత్వం మార్చింది. ‘వైఎస్సార్ లా నేస్తం’ స్కీమ్ పేరును ‘న్యాయమిత్ర’గా మారుస్తూ న్యాయశాఖ కార్యదర్శి సునీత ఉత్తర్వులు ఇచ్చారు. ఈ పథకం కొత్త మార్గదర్శకాలను త్వరలో జారీ చేస్తామని తెలిపారు. న్యాయమిత్ర ద్వారా జూనియర్ లాయర్లకు స్టైఫండ్ అందిస్తారు.