News March 21, 2024

కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?

image

కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్‌, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Similar News

News July 8, 2024

కవిత పిటిషన్‌పై విచారణ వాయిదా

image

BRS MLC కవిత డిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు విచారణను వాయిదా వేసింది. వచ్చే గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని CBIని ఆదేశించింది. కవితపై గతంలో దాఖలు చేసిన ఛార్జ్‌షీటులో తప్పులున్నందున మరోసారి ఫైల్ చేస్తామని CBI గతంలో చెప్పింది. ఇటీవల రీఫైలింగ్ చేసిన ఛార్జ్‌షీటులో కూడా తప్పులున్నట్లు కవిత లాయర్లు ఫిర్యాదు చేయడంతో సీబీఐకి కోర్టు నోటీసులిచ్చింది.

News July 8, 2024

మణిపుర్‌లో పర్యటిస్తున్న రాహుల్ గాంధీ

image

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మణిపుర్‌లో పర్యటిస్తున్నారు. జిరిబామ్, చురాచాంద్‌పూర్ జిల్లాల్లోని రిలీఫ్ క్యాంపులను సందర్శించారు. హింసాత్మక ఘటనల్లో నష్టపోయిన బాధితులను పరామర్శించారు. అంతకుముందు అస్సాంలోని కాచార్ జిల్లాలో వరద బాధితుల్ని కలుసుకున్న ఆయన, వారికి వెంటనే సహాయం అందించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.

News July 8, 2024

ఉచిత ఇసుక: టన్ను రూ.1,394.. ఫ్లెక్సీలు వైరల్

image

AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక విధానం ఇవాళ అమల్లోకి వచ్చింది. అయితే నర్సీపట్నం ఇసుక డిపో వద్ద టన్ను రేటు రూ.1,225, విశాఖ అగనంపూడి వద్ద ధర రూ.1,394 అని ఉన్న ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఉచిత ఇసుక అని చెప్పి ఇంత రేటా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి నుంచి ఇసుక తీసుకురావాల్సి ఉన్నందున ఈ రేటు ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.