News March 21, 2024
కేజ్రీవాల్‌ను కవితతో కలిపి విచారిస్తారా?
కొందరు ప్రైవేట్ వ్యక్తులకు లాభం చేకూర్చేలా ఢిల్లీ ప్రభుత్వం కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందన్నది ED ఆరోపణ. ‘సౌత్ గ్రూప్ అనే పేరుతో కవిత, శరత్‌చంద్రారెడ్డి తదితరులు సిండికేట్‌గా ఏర్పడి ఈ పాలసీ ద్వారా లబ్ధి పొందారు. అందుకు ఆప్ ప్రభుత్వానికి లంచాలు ముట్టాయి’ అని వాదిస్తోంది. ఈ కేసులో నిందితులుగా చెబుతున్న కేజ్రీవాల్, కవిత, సిసోడియాను కలిపి విచారించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Similar News
News September 14, 2024
‘మత్తు వదలరా-2’ వచ్చేది ఈ ఓటీటీలోనే
నిన్న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మత్తు వదలరా-2’ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత కొన్ని వారాలకు ఈ మూవీ ఓటీటీలో రానుంది. ఇందులో శ్రీసింహ, కమెడియన్ సత్య, హీరోయిన్ ఫరియా ప్రధాన పాత్రల్లో నటించగా, రితేశ్ రానా దర్శకత్వం వహించారు. తొలిరోజు ఈ మూవీ రూ.5.3కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది.
News September 14, 2024
ఓటీటీలోకి రాజ్ తరుణ్-మాల్వీ మూవీ
ఇటీవల చర్చనీయాంశంగా మారిన జోడీ రాజ్ తరుణ్-మాల్వీ కలిసి నటించిన చిత్రం ‘తిరగబడరసామీ’. ఈ సినిమా ఆహా వేదికగా ఈ నెల 20 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఏఎస్ రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కాగా లావణ్య అనే యువతితో ప్రేమ వ్యవహరం ఆరోపణలతో రాజ్ తరుణ్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారారు.
News September 14, 2024
ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష.. ఇంటర్నెట్ నిలిపివేత!
అస్సాంలో గ్రేడ్-3 ప్రభుత్వ ఉద్యోగాలకు రేపు ఉ.10 గంటల నుంచి మ.1:30 గంటల వరకు నియామక పరీక్ష జరగనుంది. దీంతో పరీక్ష జరిగే సమయంలో అన్ని ఎగ్జామ్ సెంటర్ల పరిధిలో ఇంటర్నెట్ను ప్రభుత్వం నిలిపివేయనుంది. 28 జిల్లాల్లో 2,305 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా మోసానికి పాల్పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గతంలోనూ పరీక్షల సమయంలో ప్రభుత్వం ఇలానే ఇంటర్నెట్ నిలిపివేసింది.