News March 21, 2024

కేజ్రీవాల్ అరెస్టుపై ఎవరేమన్నారంటే?

image

* ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది – ఖర్గే
* అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది – సీఎం స్టాలిన్
* ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు – కేరళ సీఎం
* దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు – శరద్ పవార్
* మోదీ ప్రజలకు భయపడుతున్నారు – సీతారాం ఏచూరి
* బీజేపీ భయపడుతోంది – శివసేన(UBT)

Similar News

News January 10, 2025

నేడు కలెక్టర్లతో సీఎం సమావేశం.. కీలక అంశాలపై చర్చ

image

TG: సీఎం రేవంత్ ఇవాళ మ.3 గంటలకు జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు. రైతు భరోసా, కొత్త రేషన్ కార్డుల పంపిణీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు పథకాలపై చర్చించనున్నారు. ఈనెల 26 నుంచి రైతు భరోసా పంపిణీని ప్రారంభిస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

News January 10, 2025

చైనాలో మంకీపాక్స్ కొత్త మ్యుటెంట్ కలకలం

image

ఇప్పటికే hMPVతో భయపెడుతున్న చైనా మరో బాంబ్ పేల్చింది. మంకీపాక్స్‌కు చెందిన కొత్త మ్యుటెంట్ డిటెక్ట్ అయిందని ప్రకటించింది. కాంగో నుంచి వచ్చిన వ్యక్తిలో దీన్ని గుర్తించామని, అతడి నుంచి మరో నలుగురికి ఇది సోకిందని చెప్పింది. కాగా గతేడాది కాంగోలో మంకీపాక్స్ విజృంభించడంతో WHO దాన్ని గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. తాజాగా ఈ వైరస్ చైనాకు వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది.

News January 10, 2025

ఇవాళ వైకుంఠ ఏకాదశి.. ఈ పనులు చేయొద్దు!

image

పరమ పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు బియ్యంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు. ఉపవాసం ఆచరించి, పాలు, పండ్లు, నీరు మాత్రమే తీసుకోవాలి. మాంసాహారం, మద్యపానాన్ని ముట్టరాదు. శారీరక సంబంధాలకు దూరంగా ఉంటూ బ్రహ్మచర్యం పాటించాలి. పగలు నిద్ర పోరాదు. రాత్రి జాగరణ చేస్తూ విష్ణు నామస్మరణ చేయాలి. తులసి అంటే విష్ణువుకు మహాప్రీతి. ఇవాళ తులసి ఆకులను కోయొద్దు. ఇతరులను బాధపెట్టేలా విమర్శలు, కఠిన మాటలు మాట్లాడొద్దు.