News March 21, 2024
కేజ్రీవాల్ అరెస్టుపై ఎవరేమన్నారంటే?
* ప్రతిపక్షాలను BJP బలహీనపర్చాలని చూస్తోంది – ఖర్గే
* అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ కాలరాస్తోంది – సీఎం స్టాలిన్
* ఎన్నికలకు భయపడేవారే ఇలాంటి అరెస్టులకు పాల్పడతారు – కేరళ సీఎం
* దర్యాప్తు సంస్థలను దుర్వినియోగపరుస్తూ ప్రతిపక్షాలపై దాడులు – శరద్ పవార్
* మోదీ ప్రజలకు భయపడుతున్నారు – సీతారాం ఏచూరి
* బీజేపీ భయపడుతోంది – శివసేన(UBT)
Similar News
News September 12, 2024
మదనపల్లె తహశీల్దార్ ఆఫీసులో సీఐడీ తనిఖీలు
AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్‌లో దస్త్రాల దహనం ఘటనపై సీఐడీ విచారణ జరుపుతోంది. ఇవాళ మదనపల్లె తహశీల్దార్ కార్యాలయంలో సీఐడీ డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల బృందం తనిఖీలు చేపట్టింది. కోళ్లబైలు పరిధిలోని ఫ్రీ హోల్డ్ భూముల రికార్డుల్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం.
News September 12, 2024
చంద్రబాబుతో ఉత్తమ్ భేటీ
ఏపీ సీఎం చంద్రబాబుతో తెలంగాణ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. వ్యక్తిగత పనులపై విజయవాడ వెళ్లిన ఉత్తమ్ దంపతులు సీఎంను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరు రాష్ట్రాల్లోని రాజకీయాలు, ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు సమాచారం.
News September 12, 2024
సీటు బెల్టు ధరించిన గణనాథుడు
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని అవగాహన కల్పించేందుకు రాచకొండ పోలీసులు ఇంట్రెస్టింగ్ ఫొటోను షేర్ చేశారు. ఉప్పల్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన గణనాథుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాఫిక్ సీఐ లక్ష్మీమాధవి కారులో తీసుకెళ్లారు. ఆమె తాను సీటు బెల్ట్ ధరించడంతో పాటు వినాయకుడికి కూడా బెల్టు పెట్టడం విశేషం. అంతటి గణపయ్యనే సేఫ్టీ కోసం సీటు బెల్టు ధరించినప్పుడు మనమెందుకు అలా చేయకూడదు అని పోలీసులు ట్వీట్ చేశారు.