News February 26, 2025

SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు

image

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. BSF టన్నెల్ వర్క్స్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రప్పించింది. ప్రస్తుతం వారు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీబీఎం చేరే దారి కోసం వారు వెతుకుతున్నారు. సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా ఉన్న బురదను తొలగించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు.

Similar News

News November 9, 2025

బాడీ షేమింగ్.. హీరోయిన్‌కు క్షమాపణలు

image

బాడీ షేమింగ్‌కు గురైన తమిళ హీరోయిన్ <<18220614>>గౌరీ<<>> కిషన్‌కు యూట్యూబర్ కార్తీక్ క్షమాపణలు చెప్పారు. ఆమె బరువు గురించి మీడియా సమావేశంలో ప్రశ్న లేవనెత్తినందుకు విచారం వ్యక్తం చేశారు. అయితే తాను అడిగిన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, తన మాటలు ఎవరినైనా బాధించి ఉంటే క్షమించాలని కోరారు. కాగా యూట్యూబర్ ప్రశ్నపై తమిళనాట చర్చనీయాంశంగా మారగా పలువురు సినీ ప్రముఖులు గౌరీకి మద్దతుగా నిలిచారు.

News November 9, 2025

తెలంగాణ రైతులకు బిహార్ ఎన్నికల దెబ్బ!

image

బిహార్‌ ఎన్నికలు రైతులకు సమస్యను తెచ్చి పెట్టాయి. ఓటేసేందుకు బిహారీలు సొంత రాష్ట్రానికి వెళ్తుండటంతో హమాలీల కొరత ఏర్పడి ధాన్యం కొనుగోళ్లు నిలిచిపోతున్నాయి. మిల్లుల వద్ద లోడింగ్, అన్‌లోడింగ్ కావడం లేదు. రాష్ట్రంలోని మిల్లుల్లో 20వేల మంది హమాలీలు ఉంటే 18వేల మంది బిహారీలే. ఓటేసేందుకు రాజకీయ పార్టీలు వారికి రూ.5వేల చొప్పున ఇచ్చి తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 11న అక్కడ ఎన్నికలు ముగుస్తాయి.

News November 9, 2025

ఇదే జోరు కొనసాగితే 2027కి పోలవరం పూర్తి: అతుల్ జైన్

image

AP: పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యామ్ పనులు నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతున్నాయని పీపీఏ సీఈవో అతుల్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎర్త్‌కమ్ రాక్‌ఫిల్ డ్యామ్‌లో పనులను, టెస్టింగ్ ల్యాబ్‌ను ఆయన పరిశీలించారు. అలాగే నిర్వాసితులకు పరిహారం, పునరావాస కార్యక్రమాల అమలును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు నిధుల ఢోకా లేదని, ఇదే జోరు కొనసాగితే 2027 నాటికి ప్రాజెక్టు పూర్తవుతుందని పేర్కొన్నారు.