News February 26, 2025
SLBC TUNNEL: రంగంలోకి BSF నిపుణులు

TG: SLBC టన్నెల్ వద్ద సహాయక చర్యలు శరవేగంగా కొనసాగుతున్నాయి. BSF టన్నెల్ వర్క్స్ నిపుణులను రాష్ట్ర ప్రభుత్వం రప్పించింది. ప్రస్తుతం వారు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. టీబీఎం చేరే దారి కోసం వారు వెతుకుతున్నారు. సహాయక చర్యలకు ప్రధాన ఆటంకంగా ఉన్న బురదను తొలగించేందుకు నిపుణులు సిద్ధమయ్యారు. మరోవైపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి నిపుణులతో సమీక్ష జరిపారు.
Similar News
News March 25, 2025
50 ఏళ్లకే వృద్ధులవుతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు: కూనంనేని

TG: అసెంబ్లీలో సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు 50 ఏళ్లకే వృద్ధులవుతున్నారని ఆయన అన్నారు. వీరికి కార్మిక చట్టాలు అమలవుతాయా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శ్రమ, మేధ దోపిడీ ఇక్కడే జరుగుతోందని పేర్కొన్నారు. ఎవ్వరితోనూ సంబంధం లేకుండా, పగలు, రాత్రి తెలియకుండా వారు జీవిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ ఉద్యోగులపై దృష్టి సారించాలని కోరారు.
News March 25, 2025
రేపు 108 మండలాల్లో వడగాలుల ప్రభావం

AP: రేపు రాష్ట్రంలోని <
News March 25, 2025
గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్న రైతులు: బొత్స

AP: చంద్రబాబు పాలనలో ప్రకృతి కూడా రైతులకు అనుకూలంగా ఉండదని మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేక అన్నదాతలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉందని, ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క కేజీ అయినా కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. ధర లేక చెరుకు పంటను రైతులే కాల్చుకునే పరిస్థితి ఉందన్నారు.