News February 27, 2025
ఎండోమెంట్ పరిధిలోకి చార్మినార్ ‘భాగ్యలక్ష్మీ’ అమ్మవారి ఆలయం

హైదరాబాద్‌లోని చార్మినార్‌ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మీ అమ్మవారి టెంపుల్‌ను ఎండోమెంట్ పరిధిలోకి తెస్తూ ట్రిబ్యునల్ కీలక తీర్పు ఇచ్చింది. ఆలయానికి తక్షణమే ఈవోను నియమించాలని దేవాదాయశాఖ కమిషనర్‌ను ఆదేశించింది. యూపీకి చెందిన రాజ్‌మోహన్ దాస్ టెంపుల్‌పై ఆజమాయిషీ చెలయిస్తున్నాడంటూ ఓ మహిళ కోర్టుకెక్కింది. ఆ వివాదం నడుస్తుండగానే ఎండోమెంట్ ట్రిబ్యునల్ ఆలయాన్ని దేవదాయ పరిధిలోకి తెస్తూ తీర్పునిచ్చింది.
Similar News
News February 27, 2025
ఆ పేరు వింటే తెల్ల దొరల వెన్నులో వణుకు పుట్టేది!

బ్రిటిష్ పాలకులను గజగజలాడించిన చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతి నేడు. 1906 జులై 23న మధ్యప్రదేశ్ అలీరాజ్‌పూర్ జిల్లాలో జన్మించిన ఈయన.. చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరారు. బ్రిటిషర్ల నుంచి భరతమాతకు విముక్తి కల్పించేందుకు తన ప్రాణాలను సైతం పణంగా పెట్టారు. భగత్ సింగ్‌తో చేయి కలిపి అతని సాయుధ విభాగానికి కమాండర్ ఇన్ చీఫ్‌గా వ్యవహరించారు. 1931లో 24 ఏళ్లకే వీరమరణం పొందారు.
News February 27, 2025
పిల్లల్ని ఐసిస్‌లో చేర్చుతారా అంటున్నారు: ప్రియమణి

ముస్తాఫారాజ్ అనే వ్యక్తితో తన వివాహం జరిగినప్పుడు తనపై లవ్‌జిహాద్ ఆరోపణలు చేశారని నటి ప్రియమణి ఆవేదన వ్యక్తం చేశారు. తనకు పుట్టబోయే పిల్లలని ఐసిస్‌లో చేరుస్తారా అంటూ కామెంట్లు చేయటం తనను బాధకు గురిచేస్తోందన్నారు. తన భర్తతో ఉన్న ఫోటో షేర్ చేస్తే 10లో 9నెగటివ్ కామెంట్లే ఉంటాయన్నారు. చాలా మంది కులం, మతం గురించే మాట్లాడతారని వాపోయారు. కాగా 2017లో ప్రియమణి, ముస్తాఫా మతాంతర వివాహం చేసుకున్నారు.
News February 27, 2025
ప్రపంచంలోనే అతి చిన్న పార్క్ ఇదే!

పార్క్ అనగానే పచ్చని చెట్లు, సేదతీరేందుకు కుర్చీలు, వాకింగ్ ట్రాక్‌లు గుర్తొస్తాయి. అయితే, కేవలం 50CMS మాత్రమే ఉన్న అతిచిన్న పార్కు గురించి మీరెప్పుడైనా విన్నారా? జపాన్ షిజుయోకాలోని నాగిజుమి టౌన్‌లో 0.24 చదరపు మీటర్లలో A3 పేపర్ షీట్‌లా ఈ ఉద్యానవనం ఉంటుంది. దీనిని 1988లో నిర్మించగా 2024లో సిటీ పార్కుగా మారింది. ఇది ప్రపంచంలోనే అతిచిన్న పార్క్‌గా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.