News March 22, 2024
ఐకాన్ స్టార్‌కు అరుదైన గౌరవం

పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ మైనపు విగ్రహావిష్కరణకు టైమ్ ఫిక్సయింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఈనెల 28న రాత్రి 8 గంటలకు ఆవిష్కరించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమం కోసం అల్లు అర్జున్ దుబాయ్ వెళ్లనున్నారు. పుష్ప గెటప్‌లో ఈ విగ్రహం ఉండనున్నట్లు సమాచారం. కాగా ఇప్పటికే మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో హీరోలు ప్రభాస్, మహేశ్‌బాబు మైనపు విగ్రహాలు ఏర్పాటు చేశారు.
Similar News
News February 22, 2025
కర్ణాటకకు బస్ సర్వీసులు నిలిపేసిన మహారాష్ట్ర

సరిహద్దు వివాదం నేపథ్యంలో కర్ణాటకకు బస్సు సర్వీసులు నిలిపేస్తున్నట్లు మహారాష్ట్ర ప్రకటించింది. కర్ణాటకలోని బెళగావిలో MSRTCపై KRV (కన్నడ రక్షక వేదిక) ప్రతినిధులు దాడి చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి బస్సులను నడపడం మంచిది కాదని పోలీసులు హెచ్చరించడంతో నిలిపేసింది. పోలీసుల క్లియరెన్స్ వచ్చిన తర్వాత బస్సు సర్వీసులను అధికారులు పునరుద్ధరించనున్నారు.
News February 22, 2025
IML T20: నిరాశపర్చిన సచిన్.. స్కోర్ ఎంతంటే?

ముంబైలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ టీ20-2025లో సచిన్ టెండూల్కర్ నిరాశ పరిచారు. శ్రీలంక మాస్టర్స్ జట్టుపై 8 బంతుల్లో 10 రన్స్ చేసి ఔటయ్యారు. అంబటి రాయుడు 5, గుర్‌కీరత్ సింగ్ మాన్ 44, స్టువర్ట్ బిన్నీ 68, యువరాజ్ 31*, యూసఫ్ పఠాన్ 56* రన్స్ చేశారు. ఇండియా మాస్టర్స్ 20 ఓవర్లలో 222/4 రన్స్ చేసింది.
News February 22, 2025
బంతులా?.. బుల్లెట్లా?

ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ CTలో భాగంగా ఇవాళ ఆసీస్‌పై బంతులతో నిప్పులు చెరిగారు. తొలి నాలుగు ఓవర్లలో కేవలం రెండు బంతులే 150Kmph కంటే తక్కువ వేగంతో వేశారు. మిగతా బాల్స్ అన్నీ 150Kmph కంటే వేగంగా సంధించాడు. ఇందులో వేగవంతమైన బంతి స్పీడ్ 153.5Kmph. ఇంతటి వేగంలోనూ చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌లో బాల్స్ వేయడంతో ఆసీస్ బ్యాటర్లు స్కోర్ చేసేందుకు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలోనే వుడ్ ఓ వికెట్ తీశారు.