News February 27, 2025
ఇన్ఫోసిస్ లేఆఫ్స్‌పై చర్యలు తీసుకోండి: లేబర్ మినిస్ట్రీ

ఇన్ఫోసిస్ మైసూర్ క్యాంపస్‌లో <<15417347>>ట్రైనీస్<<>> లేఆఫ్స్‌పై కలగజేసుకోవాలని KA లేబర్ కమిషనర్‌ను కేంద్ర లేబర్ మినిస్ట్రీ కోరింది. తీసుకున్న చర్యలపై వివరంగా రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది. NITES ఫిర్యాదు మేరకు రెండోసారి లేఖ రాసింది. ‘ఈ అంశాన్ని పరిశీలించి తగిన చర్యలు తీసుకోండి. అలాగే మాకూ, ఫిర్యాదుదారులకు సమాచారం ఇవ్వండి’ అని అందులో పేర్కొంది. తాము నిబంధనలకు విరుద్ధంగా నడుచుకోలేదని కంపెనీ వాదిస్తోంది.
Similar News
News February 27, 2025
ఇడ్లీ సాంబార్ వల్ల తగ్గిన టూరిజం: BJP MLA

గోవా బీచుల్లో ఎక్కడపడితే అక్కడ ఇడ్లీ సాంబార్, వడాపావ్ విక్రయించడం వల్ల విదేశీ టూరిస్టులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని కలాంగూట్ బీజేపీ ఎమ్మెల్యే మైకేల్ లోబో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల కూడా పర్యాటకుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ప్రభుత్వం అనుసరిస్తున్న కొన్ని విధానాల వల్ల కూడా టూరిస్టుల సంఖ్య తగ్గిపోతోందని, దీనికి అందరూ బాధ్యత వహించాలని పేర్కొన్నారు.
News February 27, 2025
గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు

AP: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఓ పోక్సో కేసులో బాధితురాలి పేరును ఆయన బయటకు చెప్పారని వాసిరెడ్డి పద్మ 2024 నవంబర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో మాధవ్‌పై 72, 79 BNS కింద కేసు నమోదు చేశారు. వచ్చే నెల 5న సైబర్ క్రైమ్ పోలీసుల ఎదుట విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
News February 27, 2025
ఉగాది నుంచి P4 కార్యక్రమం: సీఎం చంద్రబాబు

AP:ఉగాది నుంచి P4(public-philanthropic-people-participation) విధానం అమలు చేస్తామని CM చంద్రబాబు ప్రకటించారు. అట్టడుగున ఉన్న పేదల సాధికారత, వారిని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు దీనిని చేపడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు అదనంగా P4లో ఉన్న వారికి చేయూత ఇస్తామన్నారు. ముందుగా 4 గ్రామాల్లో <<15601118>>P4 <<>>విధానం పైలట్ ప్రాజెక్టును అమలు చేసి 5,869 కుటుంబాలకు లబ్ధి చేకూరుస్తామని CM చెప్పారు.