News February 27, 2025
Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Similar News
News February 27, 2025
ఇన్‌స్టా రీల్స్ యాప్.. టిక్‌టాక్‌కు పోటీ!

టిక్‌టాక్‌కు పోటీగా రీల్స్ కోసమే ఇన్‌స్టాగ్రామ్ ప్రత్యేకంగా ఓ యాప్ తీసుకురానుంది. ఇందులో వర్టికల్ స్క్రోల్ ఫీచర్‌తోపాటు 3 నిమిషాల వీడియోలకూ అనుమతి ఉంటుందని సమాచారం. క్రియేటర్ల కోసం మెటా గత నెల ఎడిట్స్ యాప్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇది IOS యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. USలో టిక్‌టాక్‌పై నిషేధ కత్తి వేలాడుతున్న వేళ దాని మార్కెట్‌ను సొంతం చేసుకునేందుకు మెటా పావులు కదుపుతోంది.
News February 27, 2025
సీఎం చంద్రబాబును కలిసిన పీటీ ఉష

AP: సీఎం చంద్రబాబును భారత ఒలింపిక్ సంఘం (ఐవోఏ) అధ్యక్షురాలు, ఎంపీ పీటీ ఉష కలిశారు. వెలగపూడిలోని సచివాలయంలో వీరిద్దరూ భేటీ అయ్యారు. నూతన క్రీడా విధానం, అథ్లెట్లకు శిక్షణకు సంబంధించి వీరు చర్చించుకున్నట్లు తెలుస్తోంది. అమరావతిలో స్పోర్ట్స్ సిటీ అభివృద్ధి, నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుపై చర్చించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలను సీఎం తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
News February 27, 2025
US: ప్రాణాపాయ స్థితిలో కూతురు.. తండ్రికి వీసా తిరస్కరణ

మహారాష్ట్రకు చెందిన నీలమ్ షిండే అనే యువతి USలో హిట్ అండ్ రన్‌లో గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉంది. కూతురి కోసం అక్కడికెళ్లడానికి తండ్రి ప్రయత్నించగా ముంబై వీసా అధికారులు పట్టించుకోలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. తాము వీసా ఆఫీస్‌కు వెళితే సమస్య వినడానికి కూడా సిబ్బంది ఆసక్తి చూపలేదని వాపోయారు. మహారాష్ట్ర ప్రభుత్వం, విదేశాంగ మంత్రి జైశంకర్ చొరవచూపాలని కోరుతున్నారు.