News February 27, 2025

Breaking: వక్ఫ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

image

JPC రిపోర్టు ఆధారంగా సవరించిన వక్ఫ్ బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. మార్చి 10 నుంచి మొదలయ్యే బడ్జెట్ రెండో దఫా సమావేశాల్లో లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. సాధారణ ఓటింగుతో ఉభయ సభల్లో ఆమోదం పొంది, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాజముద్ర వేస్తే కొత్త చట్టం అమల్లోకి వస్తుంది. వక్ఫ్ బిల్లును కాంగ్రెస్ సహా ఇండియా కూటమి నేతలు వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News July 7, 2025

గిల్ సేనపై లెజెండ్స్ ప్రశంసల వర్షం

image

ఎడ్జ్‌బాస్టన్‌లో గిల్ సేన వీరోచితంగా పోరాడింది. డ్రా అవుతుందనుకున్న మ్యాచ్‌ని విజయంగా మలిచారు. టీమ్ ఆల్రౌండ్ ప్రదర్శనను క్రికెట్ అభిమానులే కాదు.. లెజెండ్స్ సైతం ప్రశంసిస్తున్నారు. యంగ్ టీమ్ ఇండియా అటాక్.. ఇంగ్లండ్ కంటే గొప్పగా ఉందని గంగూలీ, సెహ్వాగ్, యువరాజ్, కోహ్లీ కొనియాడారు. కెప్టెన్‌ గిల్, ఓపెనర్స్, బౌలర్స్ ఆకాశ్ దీప్, సిరాజ్ ఇలా అంతా కలిసి గొప్ప విజయాన్ని అందుకున్నారని పేర్కొన్నారు.

News July 7, 2025

రెబలోడి దెబ్బ మర్చిపోయారా?: ప్రభాస్ ఫ్యాన్స్

image

డిసెంబర్ 5న ప్రభాస్ ‘ది రాజాసాబ్’, రణ్‌వీర్ సింగ్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ క్లాష్ కన్ఫామ్ అయిపోయింది. కొందరు బాలీవుడ్ అభిమానులు ప్రభాస్ మూవీ వాయిదా వేసుకోవాల్సిందేనంటూ పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే అలాంటి వారికి ప్రభాస్ ఫ్యాన్స్ కౌంటరిస్తున్నారు. “ప్రభాస్‌తో పోటీపడి షారుక్‌ఖానే నిలబడలేకపోయారు. సలార్‌తో పోటీగా రిలీజైన ‘డుంకీ’కి ఏమైందో అప్పుడే మర్చిపోయారా?”అంటూ SMలో పోస్టులు పెడుతున్నారు.

News July 7, 2025

ఉగ్రవాదంపై BRICS సదస్సులో తీర్మానం

image

BRICS దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కౌంటర్ టెర్రరిజంపై తీర్మానం కూడా చేశాయి. ‘క్రాస్ బోర్డర్ టెర్రరిజం సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యల కట్టడికి పోరాడతాం. ఉగ్రవాదంపై పోరులో ద్వంద్వ వైఖరిని ఉపేక్షించం. ఉగ్రమూకల అణచివేతలో దేశాల ప్రాథమిక బాధ్యతను గుర్తు చేస్తున్నాం. ఉగ్రవాద వ్యతిరేక సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తాం’ అని బ్రిక్స్ దేశాలు తీర్మానించాయి.