News February 28, 2025
నిరంతరాయంగా 100రోజుల విద్యుత్ ఉత్పత్తి

AP: కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డ్ సృష్టించింది. 800MW ఉత్పత్తి చేయగల 3వ యూనిట్లో అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే, సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24గంటల వ్యవధిలోనే 4.949MU విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు.
Similar News
News February 28, 2025
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమే కాంగ్రెస్ పోరాటం: మంత్రి ఉత్తమ్

TG: సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగిన టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షాలకు గొంతే లేకుండా చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ పోరాటం చేస్తోందన్నారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కాంగ్రెస్ నినాదాలని చెప్పారు.
News February 28, 2025
ఒక్క పోస్ట్‌తో టూరిస్ట్ ప్లేస్‌గా మారిపోయింది!

ఏదైనా కొండను చూసినప్పుడు అది జంతువు లేక మనిషి ఆకారంలో కనిపించడాన్ని గమనిస్తుంటాం. ఓ కొండ అచ్చం కుక్క ముఖం ఆకారంలో కనిపించడంతో అది చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. చైనాలోని షాంఘైకి చెందిన గువో కింగ్‌షాన్ తన వెకేషన్ ఫొటోను షేర్ చేయగా అందులో ప్రత్యేకమైన ఆకారంలో ఉన్న పర్వతంపై అందరి దృష్టీ పడింది. దీనిని ‘పప్పీ మౌంటేన్’ అని ఆమె పిలిచింది. దీంతో ఫొటోగ్రాఫర్లు, టూరిస్టులు ఆ ప్రాంతానికి తరలివస్తున్నారు.
News February 28, 2025
GET READY: రేపు 11AM గంటలకు ‘కన్నప్ప’ టీజర్

మంచు విష్ణు హీరోగా ముకేశ్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా టీజర్ రేపు విడుదల కానుంది. మార్చి 1వ తేదీన ఉదయం 11 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ‘శివ శివ శంకరా’ సాంగ్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ‘టీజర్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘కన్నప్ప’ ఏప్రిల్ 25న విడుదలవనుంది.