News February 28, 2025

నిరంతరాయంగా 100రోజుల విద్యుత్ ఉత్పత్తి

image

AP: కృష్ణపట్నం దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రికార్డ్ సృష్టించింది. 800MW ఉత్పత్తి చేయగల 3వ యూనిట్‌లో అంతరాయం లేకుండా 100 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు జెన్‌కో ఎండీ చక్రధర్ బాబు ప్రకటించారు. 2024 నవంబర్ 18 నుంచి 1,596 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగిందన్నారు. అలాగే, సీలేరు జల విద్యుత్ కేంద్రంలో 24గంటల వ్యవధిలోనే 4.949MU విద్యుత్ ఉత్పత్తి అయిందని చెప్పారు.

Similar News

News March 24, 2025

అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం

image

TG: అసెంబ్లీ లాబీలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. రాజకీయ ప్రత్యర్థులైన ఎమ్మెల్యే వివేక్, బాల్క సుమన్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వీరిద్దరూ దాదాపు 10 నిమిషాల పాటు సమావేశమయ్యారు. కాసేపటికి వీరి వద్దకు కేటీఆర్ వచ్చి వివేక్‌తో కాసేపు మాట్లాడారు. వీరిని ఓ ఎమ్మెల్యే ఫొటో తీస్తుండగా కేటీఆర్ వారించినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురూ నియోజకవర్గాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై చర్చించినట్లు సమాచారం.

News March 24, 2025

ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News March 24, 2025

పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

image

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!