News February 28, 2025

నేషనల్ సైన్స్ డే!

image

నేడు నేషనల్ సైన్స్ డే. 1928 FEB 28న శాస్త్రవేత్త సీవీ రామన్ భౌతిక శాస్త్ర పరిశోధనలను మలుపు తిప్పిన ‘రామన్​ ఎఫెక్ట్​’ను కనుగొన్నారు. ఈ పరిశోధనతో CVRను నోబెల్ అవార్డూ వరించింది. ఆయన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. 1987 నుంచి ఏటా సైన్స్ డేను నిర్వహిస్తోంది. ఈ ఏడాది ‘ఎంపవరింగ్ ఇండియన్ యూత్ ఫర్ గ్లోబల్ లీడర్​షిప్ ఇన్ సైన్స్ అండ్ ఇన్నోవేషన్ ఫర్ ఏ డెవలప్డ్ ఇండియా’ థీమ్‌తో సైన్స్ డే జరుపుకుంటున్నాం.

Similar News

News February 28, 2025

వెటరన్ యాక్టర్ ఉత్తమ్ కన్నుమూత

image

ప్రముఖ ఒడియా నటుడు ఉత్తమ్ మొహంతీ(66) కన్నుమూశారు. కొంతకాలంగా లివర్ సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 1977లో సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆయన 135 ఒడియా, 30 బెంగాలీ, పలు హిందీ చిత్రాల్లో నటించారు. ఒడియా ఫిల్మ్ ఐకాన్‌గా ఆయన గుర్తింపు పొందారు. ఉత్తమ్ మృతిపై సీఎం మోహన్ చరణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఆదేశించారు.

News February 28, 2025

అమరావతి బ్రాండ్ అంబాసిడర్‌కు సీఎం అభినందనలు

image

AP: అమరావతి బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెడికో అంబుల వైష్ణవిని నియమిస్తూ CRDA ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబును ఆమె కలవగా అభినందనలు తెలిపారు. రాజధానిపై విస్తృత ప్రచారం కల్పించాలని ఆమెకు సూచించారు. వైష్ణవి విజయవాడలోని ఓ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. ఆమె ఇప్పటివరకు రాజధాని నిర్మాణానికి రూ.50 లక్షలు విరాళంగా ఇచ్చారు.

News February 28, 2025

ఉగ్రవాదిని అనుకుని గన్‌తో కాల్చబోయారు: సునీల్ శెట్టి

image

వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి జరిగిన కొన్ని రోజులకు తనకు USలో భయానక పరిస్థితి ఎదురైనట్లు సునీల్ శెట్టి వెల్లడించారు. ‘2001లో నేను కాంటే మూవీ షూటింగ్ తర్వాత LAలోని హోటల్‌కు వెళ్తుండగా నా లుక్‌ను చూసి టెర్రరిస్టు అని అనుమానించారు. కిందికి రాకపోతే కాల్చేస్తామని పోలీసులు హెచ్చరించారు. మోకాళ్లపై కూర్చోబెట్టి సంకెళ్లు వేశారు. హోటల్ మేనేజర్ నేనెవరో చెప్పడంతో వదిలేశారు’ అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

error: Content is protected !!