News February 28, 2025

$280కి బదులుగా $81 ట్రిలియన్ల జమ.. చివరికి!

image

అమెరికాకు చెందిన citi బ్యాంక్ ఓ ఘోర తప్పిదం చేసింది. ఓ కస్టమర్ అకౌంట్‌లో 280 డాలర్లకు బదులుగా పొరపాటున $81 ట్రిలియన్లను జమ చేసింది. దీన్ని ఇద్దరు సిబ్బంది గుర్తించలేకపోయారు. మరో ఉద్యోగి దాదాపు 90 నిమిషాల తర్వాత పసిగట్టి తప్పును సరిదిద్దారు. ఇంత భారీ మొత్తంలో పేమెంట్ ప్రాసెస్ పూర్తికాలేదని, అయినా వెంటనే దోషాన్ని గుర్తించామని కంపెనీ తెలిపింది.

Similar News

News March 1, 2025

WPL: టేబుల్ టాప్‌లో ఢిల్లీ

image

ముంబైతో జరిగిన మ్యాచులో ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 123 పరుగులు చేసింది. ఛేదనలో ఢిల్లీ బ్యాటర్లు రెచ్చిపోయారు. కెప్టెన్ లానింగ్(60*) అర్ధసెంచరీ చేయగా షఫాలీ 28 బంతుల్లో 43 రన్స్ చేశారు. 10వ ఓవర్లో షఫాలీ ఔటైనా రోడ్రిగ్స్‌తో కలిసి కెప్టెన్ జట్టును విజయతీరాలకు చేర్చారు. దీంతో 8 పాయింట్లతో ఢిల్లీ తొలి స్థానానికి చేరింది.

News March 1, 2025

ఇంటర్ పరీక్షలు.. సీఎస్ కీలక సూచనలు

image

TG: ఇంటర్ పరీక్షలు సజావుగా సాగేలా చూడాలని కలెక్టర్లకు సీఎస్ శాంతికుమారి సూచించారు. పరీక్షల నిర్వహణపై వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాపీయింగ్‌కు ఆస్కారం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. చేతి గడియారంతో సహా ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించబోమని తెలిపారు. మార్చి 5 నుంచి 25 వరకు పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేసేలా చూడాలని పోలీసులను సీఎస్ ఆదేశించారు.

News March 1, 2025

చరిత్రలో ఈరోజు.. మార్చి 1

image

* 1901- ఆంధ్ర రాష్ట్ర తొలి శాసనసభాపతి నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1968- భారత మాజీ వెయిట్ లిఫ్టర్ కుంజరాణి దేవి జన్మదినం
* 1969- ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్‌లు ప్రవేశపెట్టారు. తొలి రైలు ఢిల్లీ, కోల్‌కతా మధ్య నడిచింది
* 1986- తెలుగు సింగర్ కారుణ్య పుట్టినరోజు

error: Content is protected !!