News March 22, 2024
లాసెట్ నోటిఫికేషన్ విడుదల
APలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ను ANU విడుదల చేసింది. 3, 5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జరిమానాతో మే 29 వరకు అప్లై చేయవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. జూన్ 9న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.
Similar News
News November 26, 2024
ముగిసిన IPL మెగా వేలం
IPL-2025 మెగా వేలం ముగిసింది. నిన్న, ఈరోజు జరిగిన ఆక్షన్‌లో ఆటగాళ్లను 10 ఫ్రాంచైజీలు రూ.వందల కోట్లు చెల్లించి కొనుగోలు చేశాయి. అత్యధికంగా రిషభ్ పంత్‌ను లక్నో రూ.27 కోట్లకు, శ్రేయస్ అయ్యర్‌ను పంజాబ్ రూ.26.75 కోట్లకు సొంతం చేసుకున్నాయి. IPL చరిత్రలో అత్యంత చిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీని రాజస్థాన్ రూ.1.10 కోట్లకు దక్కించుకుంది. IPL-2025 సీజన్ వచ్చే ఏడాది మార్చి 14న ప్రారంభం కానుంది.
News November 26, 2024
మళ్లీ వేలంలోకి అర్జున్ టెండూల్కర్.. ఎవరు కొన్నారంటే?
IPL-2025 వేలంలో అన్‌సోల్డ్‌గా మిగిలిన సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ను నిర్వాహకులు మరోసారి వేలంలోకి తెచ్చారు. ఈసారి అతడిని ముంబై ఇండియన్స్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలోనూ అర్జున్‌ను MI దక్కించుకుంది. లిజాద్ విలియమ్స్‌ను కూడా MI రూ.75లక్షలకు సొంతం చేసుకుంది.
News November 26, 2024
‘ఫస్ట్ నైట్ ఎఫెక్ట్’ అంటే ఏంటో తెలుసా?
కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు నిద్ర పట్టిందా? అని అడుగుతారు. ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా? తెలియని పరిసరాలలో నిద్రిస్తున్నప్పుడు, మనిషి మెదడులో సగం మాత్రమే విశ్రాంతి పొందుతుందని బ్రౌన్ యూనివర్సిటీ పరిశోధనలో వెల్లడైంది. ‘కుడివైపు కంటే ఎడమవైపు ఎక్కువ మేల్కొని ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకే కొత్త ప్రదేశంలో నిద్రించిన తర్వాత కొందరు అలసిపోతారు. దీనిని ఫస్ట్ నైట్ ఎఫెక్ట్ అంటారు’ అని పరిశోధకులు తెలిపారు.