News March 22, 2024

లాసెట్ నోటిఫికేషన్ విడుదల

image

APలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్‌ను ANU విడుదల చేసింది. 3, 5 ఏళ్ల LLB కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులు ఈ నెల 26 నుంచి ఏప్రిల్ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జరిమానాతో మే 29 వరకు అప్లై చేయవచ్చు. జూన్ 3 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తారు. జూన్ 9న ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహిస్తారు.

Similar News

News September 18, 2024

లెబనాన్‌లో పేలిన వాకీటాకీలు

image

లెబనాన్‌లో <<14129580>>పేజర్లు<<>> పేలిన ఘటన మరువకముందే మళ్లీ అక్కడ వాకీ టాకీలు పేలాయి. ఈ ఘటనల్లో ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. కాగా లెబనాన్‌లోని పలు ప్రాంతాల్లో పేలుళ్లు సంభవించాయి. ఇప్పటివరకు 12 మంది మరణించారు. ఈ ఘటనపై హెజ్బొల్లా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది. ఇప్పటికే ఇజ్రాయెల్‌పై హమాస్, హౌతీ రెబల్స్ దాడులు చేస్తుండగా హెజ్బొల్లా కూడా రంగంలోకి దిగనుంది.

News September 18, 2024

శ్రీలంక క్రికెటర్ అరుదైన ఘనత

image

టెస్టుల్లో శ్రీలంక క్రికెటర్ కమిందు మెండిస్ అరుదైన ఘనత సాధించారు. టెస్టుల్లో 80.90 యావరేజ్ కలిగిన రెండో బ్యాటర్‌గా ఆయన రికార్డు సృష్టించారు. అగ్ర స్థానంలో బ్రాడ్‌మన్ (99.94) ఉన్నారు. మూడో స్థానంలో జైస్వాల్ (68.53) కొనసాగుతున్నారు. మెండిస్ తానాడిన తొలి 7 టెస్టుల్లోనే 4 సెంచరీలు, 4 అర్ధ సెంచరీలతో 809 రన్స్ సాధించారు. కనీసం 10 ఇన్నింగ్స్‌లు ఆడిన వారిలో అత్యధిక పరుగులు చేసిన ఏడో ప్లేయర్‌గానూ నిలిచారు.

News September 18, 2024

ALERT.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

image

APలోని పలు జిల్లాల్లో రేపు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. అటు తెలంగాణలో ఈ నెల 21 నుంచి మళ్లీ వర్షాలు కురుస్తాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.