News March 1, 2025
నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
Similar News
News March 1, 2025
చెస్ ర్యాంకింగ్స్.. టాప్-10లో ముగ్గురు ఇండియన్స్

ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ (FIDE) తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి ముగ్గురు ప్లేయర్లు టాప్-10లో నిలిచారు. మూడో స్థానంలో గుకేశ్(2787), ఐదో స్థానంలో అర్జున్ ఎరిగైసి (2777), ఎనిమిదో ర్యాంకులో ప్రజ్ఞానంద(2758) ఉన్నారు. గుకేశ్‌కు తన కెరీర్‌లో ఇదే హైయెస్ట్ ర్యాంకింగ్. కాగా తొలి రెండు స్థానాల్లో కార్ల్‌సన్(2833), నకమురా(2802) కొనసాగుతున్నారు.
News March 1, 2025
వారికి ఎక్స్‌గ్రేషియా.. సీఎం కీలక ఆదేశాలు

TG: గల్ఫ్‌లో మరణించిన కార్మికుల కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. రూ.5 లక్షల చొప్పున 113 బాధిత కుటుంబాలకు వెంటనే నిధులు విడుదల చేయాలన్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ఖనిజాభివృద్ధి శాఖ సమీక్ష సందర్భంగా అధికారులు ఎక్స్‌గ్రేషియా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తక్షణమే స్పందించిన సీఎం నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.
News March 1, 2025
OTT & టీవీల్లోకి బ్లాక్ బస్టర్ మూవీ!

ఇంటిల్లిపాదిని నవ్వించేందుకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మీ ముందుకు వచ్చేసింది. ఈ చిత్రం జీ తెలుగు ఛానల్‌లో ప్రసారం అవుతోంది. సినీ చరిత్రలో తొలిసారి ఈ మూవీ (జీ5)OTTతో పాటు TVల్లో ఒకేసారి రిలీజ్ అయింది. విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రం ఇప్పటికే థియేటర్లలో అదరగొట్టిన విషయం తెలిసిందే. ఈ సినిమా చూస్తున్నారా? COMMENT