News March 1, 2025
నోటికొచ్చినట్లు మాట్లాడితే కుదరదు: హోంమంత్రి

AP: కూటమి ప్రభుత్వంలో ఎటువంటి అంతర్యుద్ధం లేదని, YCPలో రాకుండా చూసుకోవాలని హోంమంత్రి అనిత అన్నారు. తప్పు చేసిన వారిని వదలబోమని చెప్పారు. నోటికొచ్చినట్లు మాట్లాడతామంటే కుదరదని హెచ్చరించారు. పోసానిపై రాష్ట్ర వ్యాప్తంగా 17 కేసులున్నాయని, ఆయన వ్యాఖ్యలను ఎవరూ క్షమించరని చెప్పారు. తాము రెడ్‌బుక్ ప్రకారం ముందుకెళ్తే YCP నేతలు రోడ్లపై తిరగలేరన్నారు. కక్షపూరిత రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేశారు.
Similar News
News March 20, 2025
రెండో భర్తతో సింగర్ విడాకులు

ప్రముఖ సింగర్ సియా ఫర్లర్ తన రెండో భర్త డేనియల్ బెర్నాడ్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత వారిద్దరు వేరుకానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విడాకుల కోసం సియా కోర్టును ఆశ్రయించినట్లు పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. ఆమె పాడిన <
News March 20, 2025
ఈ నెల 29న సూర్య గ్రహణం

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.
News March 20, 2025
కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్‌లోని నవ్‌గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.