News March 1, 2025
కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Similar News
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్‌ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్‌తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్‌ను ICC తిరస్కరించింది.
News September 17, 2025
IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.