News March 1, 2025

కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న సస్పెండ్

image

TG: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇటీవల బీసీ సభలో ఓ వర్గంపై మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు హైకమాండ్ గుర్తించింది. ఆ వ్యాఖ్యలపై ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని FEB 5న షోకాజ్ నోటీసులు ఇచ్చింది. మల్లన్న స్పందించకపోవడంతో పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.

Similar News

News March 20, 2025

రెండో భర్తతో సింగర్ విడాకులు

image

ప్రముఖ సింగర్ సియా ఫర్లర్ తన రెండో భర్త డేనియల్ బెర్నాడ్ నుంచి విడాకులు తీసుకోనున్నారు. పెళ్లైన రెండేళ్ల తర్వాత వారిద్దరు వేరుకానున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. విడాకుల కోసం సియా కోర్టును ఆశ్రయించినట్లు పీపుల్ మ్యాగజైన్ పేర్కొంది. ఆమె పాడిన <>చీప్ థ్రిల్స్ ఆల్బమ్<<>> సంగీత ప్రపంచాన్ని ఓ ఊపు ఊపింది. ఓన్లీ సీ, హీలింగ్ డిఫికల్ట్, కలర్ ది స్మాల్ వన్ వంటి ఆల్బమ్స్ సియా ఖాతాలో ఉన్నాయి.

News March 20, 2025

ఈ నెల 29న సూర్య గ్రహణం

image

ఈ నెల 29వ తేదీన సూర్యగ్రహణం ఏర్పడుతుందని నాసా తెలిపింది. ఇది సంపూర్ణ గ్రహణం అయినప్పటికీ భూమిపై నుంచి పాక్షికంగా కనిపిస్తుందని వెల్లడించింది. భారతీయులు ఈ గ్రహణాన్ని చూసే అవకాశం లేదని చెప్పింది. నార్త్ అమెరికా, యూరప్, ఆఫ్రికా, నార్తర్న్ ఆసియా, సౌత్ అమెరికా, గ్రీన్ లాండ్, ఐలాండ్ దేశస్థులు గ్రహణాన్ని పాక్షికంగా చూడవచ్చని స్పష్టం చేసింది. కాగా, కొత్త ఏడాదిలో ఇది తొలి సూర్యగ్రహణం కావడం విశేషం.

News March 20, 2025

కేంద్ర మంత్రి కుటుంబంలో కాల్పుల కలకలం

image

కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్ కుటుంబ సభ్యుల మధ్య కాల్పులు కలకలం రేపాయి. బిహార్‌లోని నవ్‌గచియాలో ఆయన మేనల్లుళ్లు అయిన విశ్వజిత్, జైజిత్ మధ్య నల్లా నీటి విషయంలో వివాదం నెలకొంది. ఈ క్రమంలో ఇరువర్గాలు కాల్పులకు దిగాయి. విశ్వజిత్ బుల్లెట్ గాయాలతో మరణించగా జైజిత్, తల్లి(నిత్యనందరాయ్ సోదరి) గాయపడ్డారు. జైజిత్ పరిస్థితి విషమంగా ఉంది. వీరిని భాగల్పూర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

error: Content is protected !!