News March 2, 2025

ఢిల్లీ జోరు.. కప్పు కొట్టేనా?

image

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. నిన్న ఆర్సీబీపై విజయంతో ఈ ఏడాది ప్లే‌ఆఫ్ చేరుకున్న తొలి టీమ్‌గా నిలిచింది. గత రెండేళ్లలో ఫైనల్ చేరిన ఈ జట్టుకు కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ సారైనా మెగ్ లానింగ్ నాయకత్వంలో టీమ్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సారథితో పాటు షఫాలీ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.

Similar News

News November 9, 2025

ప్రీమెచ్యూర్ మెనోపాజ్ గురించి తెలుసా?

image

40 ఏళ్ల కంటే ముందే రుతుక్రమం ఆగిపోతే, దీన్ని ‘ప్రీమెచ్యూర్ మెనోపాజ్’ అంటారు. ప్రపంచంలో ఇతర మహిళల కంటే భారతీయ మహిళళ్లో ప్రీమెచ్యూర్ మెనోపాజ్ రేటు కాస్త ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. మహిళల ఆర్థికస్థితి, పోషకాహార లోపం, కుటుంబంలో మానసిక ఒత్తిడి, పెళ్లి చిన్న వయసులోనే అవ్వడం, విడాకులు వంటివి మహిళలలో ప్రీమెచ్యూర్ మెనోపాజ్‌‌కు కారణమవుతాయి. కీమోథెరపీ, రేడియోథెరపీ లాంటివి దీనికి కారణం కావొచ్చు.

News November 9, 2025

గ్రూప్-3.. రేపటి నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్

image

TG: 1,388 గ్రూప్-3 ఉద్యోగాలకు ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ రేపటి నుంచి ఈ నెల 26 వరకు కొనసాగనుంది. నాంపల్లిలోని తెలుగు వర్సిటీలో రోజూ 10.30AM నుంచి 1.30PM, తిరిగి 2PM నుంచి 5.30PM వరకు పరిశీలన జరగనుంది. విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.

News November 9, 2025

విధ్వంసం.. 13 బంతుల్లో 54 రన్స్

image

హాంకాంగ్ సిక్సెస్-2025లో ఆటగాళ్లు ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నారు. తాజాగా సౌతాఫ్రికాతో మ్యాచులో బంగ్లా ఓపెనర్ హబీబుర్ రెహ్మాన్ ఊచకోత కోశారు. 13 బంతుల్లోనే 54 రన్స్ చేసి రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగారు. ఆయన ఏకంగా 8 సిక్సర్లు, ఒక ఫోర్ బాదారు. అంటే బౌండరీల ద్వారానే 52 రన్స్ రాబట్టారు. మరో ప్లేయర్ హొస్సైన్ 8 బంతుల్లో 27 రన్స్ చేయడంతో BAN 6 ఓవర్లలో 128 పరుగులు చేసింది. SA 25 రన్స్ తేడాతో ఓడిపోయింది.