News March 2, 2025
ఢిల్లీ జోరు.. కప్పు కొట్టేనా?

WPLలో ఢిల్లీ క్యాపిటల్స్ జోరు కొనసాగుతోంది. నిన్న ఆర్సీబీపై విజయంతో ఈ ఏడాది ప్లేఆఫ్ చేరుకున్న తొలి టీమ్‌గా నిలిచింది. గత రెండేళ్లలో ఫైనల్ చేరిన ఈ జట్టుకు కప్పు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలింది. ఈ సారైనా మెగ్ లానింగ్ నాయకత్వంలో టీమ్ ట్రోఫీని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. సారథితో పాటు షఫాలీ ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం.
Similar News
News March 15, 2025
అమ్మానాన్నా.. ఆలోచించండి!

ఆర్థిక, మానసిక ఇబ్బందులతో ఎంతోమంది బలవన్మరణాలపాలవుతున్నారు. పిల్లలున్నవారు బిడ్డల్నీ చంపేస్తున్నారు. <<15717792>>హబ్సిగూడ<<>>, <<15765431>>కాకినాడ<<>> ఘటనలు అందర్నీ కలచివేస్తున్నాయి. పసిప్రాణాలను చిదిమేసే హక్కు తల్లిదండ్రులకు లేదంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మీ కష్టాలకు మీ పసివాళ్లను కూడా బలిచేయడం ఎంతవరకూ న్యాయమో అమ్మానాన్నలు ఆలోచించాలని కోరుతున్నారు.
*సమస్య ఎలాంటిదైనా ఆత్మహత్య మాత్రం పరిష్కారం కాదు.
News March 15, 2025
‘ప్రపంచంతో పోటీ పడటంలేదు.. నా పిల్లల్ని చంపేస్తున్నా’

AP: 1వ తరగతి, UKG చదివే ఇద్దరు పిల్లల్ని అత్యంత క్రూరంగా హతమార్చాడో తండ్రి. ఈ ప్రపంచంతో పోటీ పడలేకపోతున్నారని, చంపేస్తున్నానంటూ సూసైడ్ నోట్ రాశాడు. కాకినాడ(D) సర్పవరం ONGCలో పనిచేస్తున్న చంద్రకిశోర్ భార్య, పిల్లలతో కలిసి నిన్న ఆఫీస్‌లో హోలీ వేడుకల్లో పాల్గొన్నాడు. తర్వాత పిల్లలను ఇంటికి తీసుకెళ్లి కాళ్లూ చేతులు తాళ్లతో కట్టేసి, నీటి బకెట్లో తలలు ముంచి చంపేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.
News March 15, 2025
సౌతాఫ్రికా రాయబారికి ట్రంప్ సర్కారు షాక్

తమ దేశంలోని దక్షిణాఫ్రికా రాయబారి ఇబ్రహీం రసూల్‌కు ట్రంప్ సర్కారు షాకిచ్చింది. ఆయన తమ దేశంలో ఉండటానికి వీల్లేదని, వెంటనే స్వదేశానికి పయనమవ్వాలని తేల్చిచెప్పింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ మేరకు సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘ఇబ్రహీం ఓ జాత్యహంకార రాజకీయ నేత. అమెరికన్లను, మా అధ్యక్షుడిని ద్వేషిస్తున్నారు. ఆయనతో మాట్లాడేదేం లేదు. దేశం నుంచి పంపించేయడమే’ అని పేర్కొన్నారు.