News March 22, 2024
ELECTORAL BONDS: BRSకు ‘కిటెక్స్’ విరాళం

ఎలక్టోరల్ బాండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ ‘కిటెక్స్’ రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు విరాళం ఇవ్వడం గమనార్హం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని ప్రభుత్వం కిటెక్స్‌కు కేటాయించింది.
Similar News
News April 10, 2025
‘విశ్వంభర’ ఆలస్యం వెనుక అదే కారణం?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కిస్తున్న ‘విశ్వంభర’ను ఈ ఏడాది జనవరికే విడుదల చేయాలనుకున్నా దాన్ని తర్వాత వాయిదా వేశారు. మూవీలో ఓ స్పెషల్ సాంగ్‌కి కీరవాణి ఇచ్చిన ట్యూన్ చిరుకు నచ్చకపోవడమే వాయిదా వెనుక కారణమని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. కీరవాణి కొత్త ట్యూన్ ఇచ్చే పనిలో ఉన్నారని వెల్లడించాయి. ఈ స్పెషల్ సాంగ్‌లో చిరు మాస్ స్టెప్స్ వేయనున్నారని స్పష్టం చేశాయి.
News April 10, 2025
బ్యాడ్మింటన్ ఆసియా: రెండో రౌండ్‌కు దూసుకెళ్లిన సింధు

బ్యాడ్మింటన్ ఆసియా ఛాంపియన్ షిప్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. ఇండోనేషియాకు చెందిన ఎస్తేర్ వార్డోయోపై ఆమె వరస సెట్లలో 21-15, 21-19 తేడాతో గెలుపొందారు. తర్వాతి రౌండ్‌లో జపాన్‌కు చెందిన అకానీ యమగుచీతో ఆమె తలపడనున్నారు. మరోవైపు లక్ష్యసేన్, ప్రణోయ్ ఇద్దరూ ఇంటిబాట పట్టారు.
News April 10, 2025
ఒంటిమిట్ట కళ్యాణోత్సవానికి టీటీడీ లడ్డూలు

AP: కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామ స్వామి కళ్యాణం రేపు సాయంత్రం 6.30 గంటల నుంచి కన్నులపండువగా జరగనుంది. ఈ కార్యక్రమానికి హాజరయ్యే భక్తుల కోసం టీటీడీ 70వేల లడ్డూలను పంపించనుంది. తిరుమలలోని శ్రీవారి సేవాసదన్-2లో సేవకులు ఈ లడ్డూల ప్యాకింగ్ పూర్తి చేశారు. రేపు కళ్యాణం అనంతరం భక్తులకు వీటిని పంచిపెట్టనున్నారు.