News March 22, 2024

ELECTORAL BONDS: BRSకు ‘కిటెక్స్’ విరాళం

image

ఎలక్టోరల్ బాండ్స్‌లో బీఆర్ఎస్ పార్టీకి కేరళకు చెందిన టెక్స్‌టైల్ గ్రూప్ ‘కిటెక్స్’ రూ. 25 కోట్లు విరాళంగా ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నవంబర్ నెలలో బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు విరాళం ఇవ్వడం గమనార్హం. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంపేట హవేలిలో కాకతీయ టెక్స్‌టైల్ పార్కు కోసం రైతుల నుంచి సేకరించిన 187 ఎకరాల భూమిని ప్రభుత్వం కిటెక్స్‌కు కేటాయించింది.

Similar News

News September 17, 2024

రేవంత్ ‘కంప్యూటర్’ కామెంట్స్‌పై KTR సెటైర్లు

image

TG: CM రేవంత్ <<14117106>>వ్యాఖ్యలపై<<>> చిట్టినాయుడు సుభాషితాలు అంటూ KTR సెటైర్లు వేశారు. ‘కంప్యూటర్‌ కనిపెట్టింది రాజీవ్ కాదు చార్లెస్ బాబేజీ. దేశానికి కంప్యూటర్ పరిచయం చేసిందీ రాజీవ్ కాదు. TIFRAC వారు 1956లో ఇక్కడ కంప్యూటర్ సేవలు ప్రారంభించారు. రాజీవ్‌కు అప్పటికి 12ఏళ్లు. నోటికొచ్చింది వాగి దొరికిపోవడం ఎందుకు? నీకు బాగా తెలిసిన రియల్టీ దందాలు, బ్లాక్ మెయిల్‌కి పరిమితమైతే మంచిదమ్మా చిట్టి’ అని ట్వీట్ చేశారు.

News September 17, 2024

రిలీజ్‌కు ముందే చరిత్ర సృష్టించిన ‘దేవర’

image

జూ.ఎన్టీఆర్, జాన్వీ జంటగా నటించిన ‘దేవర’ మూవీ చరిత్ర సృష్టించింది. అమెరికా అడ్వాన్స్ ప్రీమియర్ టికెట్ సేల్స్‌లో అత్యంత వేగంగా $1.75M సాధించిన తొలి భారతీయ చిత్రంగా నిలిచినట్లు మేకర్స్ వెల్లడించారు. అలాగే 10 రోజుల్లోనే 45 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయినట్లు తెలిపారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ట్రైలర్, పాటలు మూవీపై అంచనాలను పెంచేశాయి.

News September 17, 2024

వడ్డీరేటును ఎంత తగ్గిస్తుందో?

image

ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లు వేయికళ్లతో ఎదురుచూస్తున్న తరుణం రానే వచ్చింది. US ఫెడ్ వడ్డీరేటును ఎంతమేర తగ్గిస్తుందోనని ఆత్రుతగా చూస్తున్నారు. బుధవారం ముగిసే సమావేశాల్లో ఫెడ్ ఛైర్ జెరోమ్ పావెల్ వడ్డీరేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గిస్తారని రాయిటర్స్ అంచనా వేసింది. కనీసం 25 బేసిస్ పాయింట్ల కోత కచ్చితంగా ఉంటుందని అనలిస్టుల మాట. అదే జరిగితే గ్లోబల్ స్టాక్ మార్కెట్లు రాకెట్లలా దూసుకెళ్లడం ఖాయం.