News March 22, 2024

బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా?

image

దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఖాతాల నుంచి రూ.లక్ష విత్‌డ్రా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ‘ఈ వివరాలను అన్ని బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించాలి. ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు డబ్బుల బదిలీపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఈసీ పేర్కొంది.

Similar News

News January 20, 2026

BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

image

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్‌లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!

News January 20, 2026

ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

image

<>కేరళలోని <<>>ఇన్‌స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ 81 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత గల డిప్లొమా, డిగ్రీ(ఇంజినీరింగ్) అభ్యర్థులు ఫిబ్రవరి 9 వరకు NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,300, డిప్లొమా హోల్డర్లకు రూ.10,900 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://ilpgt.com

News January 20, 2026

ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.