News March 22, 2024
బ్యాంకు లావాదేవీలు చేస్తున్నారా?
దేశంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బ్యాంకు లావాదేవీలపై దృష్టి పెట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. ఖాతాల నుంచి రూ.లక్ష విత్‌డ్రా, డిపాజిట్ చేసినా అందుకు సంబంధించిన వివరాలను ఆరా తీయాలని ఆదేశించింది. ‘ఈ వివరాలను అన్ని బ్యాంకుల నుంచి అధికారులు తెప్పించుకోవాలి. వాటిని విశ్లేషించాలి. ఒకే బ్యాంక్ బ్రాంచి నుంచి వేర్వేరు ఖాతాలకు డబ్బుల బదిలీపై ఫిర్యాదులు వస్తున్నాయి’ అని ఈసీ పేర్కొంది.
Similar News
News September 18, 2024
పదేళ్ల తర్వాత మమ్ముట్టి, మోహన్ లాల్ మూవీ
మాలీవుడ్ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్ పదేళ్ల తర్వాత కలిసి నటించనున్నారు. మహేశ్ నారాయణ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. మెజార్టీ షూటింగ్ శ్రీలంకలోనే జరుగుతుందని సమాచారం. ఆ తర్వాత కేరళ, ఢిల్లీ, లండన్‌లో చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో దాదాపు 50 సినిమాలు వచ్చాయి. చివరిసారిగా 2013లో ‘కాథల్ కదన్ను ఒరు మాతుకుట్టి’ అనే చిత్రంలో నటించారు.
News September 18, 2024
నేడు జమ్మూకశ్మీర్‌లో తొలి దశ పోలింగ్
పదేళ్ల తర్వాత జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. తొలిదశలో ఇవాళ 24 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 219 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని 23 లక్షల మంది ఓటర్లు తేల్చనున్నారు. 3,276 పోలింగ్ కేంద్రాలను EC సిద్ధం చేసింది. ఉగ్రదాడుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసింది. INC-NC కలిసి పోటీ చేస్తుండగా, PDP, BJP, JKPM, PC, ఆప్నీ పార్టీలు విడివిడిగా బరిలో ఉన్నాయి.
News September 18, 2024
అమరావతి రైల్వే లైన్ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు?
AP: అమరావతి కొత్త రైల్వే లైన్ కోసం 510 ఎకరాల భూమి అవసరమని రైల్వే శాఖ గుర్తించింది. NTR జిల్లాలో 296, గుంటూరులో 155, ఖమ్మంలో 60 ఎకరాల చొప్పున కావాలని ఆయా జిల్లాల రెవెన్యూ యంత్రాంగానికి ప్రతిపాదనలు పంపింది. ఈ భూముల సేకరణకు రూ.వెయ్యి కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఈ వ్యయాన్ని భరించేందుకు రైల్వే శాఖ అంగీకరించినట్లు, పాత అలైన్‌మెంట్ ప్రకారం ఎర్రుపాలెం నుంచి రైల్వే లైన్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.