News March 3, 2025
పుతిన్ కంటే వారే ప్రమాదం: ట్రంప్

అమెరికాకు పుతిన్ కంటే అక్రమ వలసలని నిరోధించటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. హంతకులు, డ్రగ్స్‌మాఫియా, రేపిస్టులను దేశంలోనికి రాకుండా నిరోధించటం వల్ల తమ దేశం యూరప్‌లా మారకుండా ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు భారీగా తగ్గించామని ‘అమెరికాపై దండయాత్ర ముగిసిందని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో నెలకు 3లక్షలకు పైగా అక్రమ వలసదారులు దేశంలో ప్రవేశించేవారని అన్నారు.
Similar News
News January 9, 2026
చిత్తూరు : రేపటి నుంచి సంక్రాంతి సెలవులు

చిత్తూరు జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలకు శనివారం నుంచి ఈనెల 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఇస్తున్నట్లు DEO రాజేంద్రప్రసాద్ తెలిపారు. పాఠశాల పని దినాలు సర్దుబాటులో భాగంగా 10న రెండో శనివారం పాఠశాలలు పనిచేయాల్సి ఉన్నా, సెలవు దినంగా ప్రకటించామన్నారు. ఈ దినాన్ని మరో రోజున పనిదినంగా పరిగణించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా, టెన్త్ విద్యార్థులకు వంద రోజుల ప్రత్యేక తరగతులకు సైతం బ్రేక్ ఇచ్చారు.
News January 9, 2026
కొల్లాజెన్ ఎక్కువగా దొరికే ఆహారాలు

మన చర్మం ఆరోగ్యంగా ఉండాలన్నా, జుట్టు మృదువుగా, ఉండాలన్నా కొల్లాజెన్ కీలకం. కొల్లాజెన్ కోసం సాల్మన్, ట్యూనా, సార్డినెస్ చేపలు, సిట్రస్ పండ్లు, బెర్రీలు, గుడ్లు, పాలకూర, కాలే, బచ్చలికూర వంటి ఆకుకూరల్లో కొల్లాజెన్ దొరుకుతుంది. ధూమపానం, ఎండలో గడపడం, అధిక చక్కెరలు, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, అధిక ఒత్తిడి స్థాయులు కూడా శరీరంలో కొలాజెన్ క్షీణతకు కారణమవుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
News January 9, 2026
రాష్ట్ర పండుగగా కోనసీమ ప్రభల తీర్థం.. విశేషమిదే!

AP: కోనసీమ సంస్కృతి, సంప్రదాయాలకు నిదర్శనంగా నిలిచే జగ్గన్నతోట ప్రభల తీర్థానికి రాష్ట్ర పండుగ హోదా లభించింది. ఈ వేడుకలకు 400+ ఏళ్ల చరిత్ర ఉంది. ఏటా కనుమ రోజున ఈ తీర్థాన్ని నిర్వహిస్తారు. 11 గ్రామాల్లోని పురాతన శైవ ఆలయాల నుంచి 11 ఏకాదశ రుద్రులతో ప్రభలను ప్రజలు మోసుకుంటూ పొలాలు, తోటలు, కౌశికా నదిని దాటుకుని జగ్గన్నతోటకు చేరుస్తారు. ఈ ఉత్సవాలను చూసేందుకు ఏటా దాదాపు 6 లక్షల మంది హాజరవుతారని అంచనా.


