News March 3, 2025

పుతిన్ కంటే వారే ప్రమాదం: ట్రంప్

image

అమెరికాకు పుతిన్ కంటే అక్రమ వలసలని నిరోధించటమే ముఖ్యమని ట్రంప్ అన్నారు. హంతకులు, డ్రగ్స్‌మాఫియా, రేపిస్టులను దేశంలోనికి రాకుండా నిరోధించటం వల్ల తమ దేశం యూరప్‌లా మారకుండా ఉంటుందన్నారు. అధికారం చేపట్టిన తొలి నెలలోనే అక్రమ వలసలు భారీగా తగ్గించామని ‘అమెరికాపై దండయాత్ర ముగిసిందని’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బైడెన్ ప్రభుత్వంలో నెలకు 3లక్షలకు పైగా అక్రమ వలసదారులు దేశంలో ప్రవేశించేవారని అన్నారు.

Similar News

News March 20, 2025

ఆర్సీబీ వదిలేశాక భావోద్వేగానికి లోనయ్యాను: సిరాజ్

image

ఆర్సీబీ నుంచి వేరయ్యాక తాను భావోద్వేగానికి లోనయ్యానని పేసర్ సిరాజ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘నా కెరీర్ ఈరోజు ఇలా ఉండటం వెనుక విరాట్ కీలక పాత్ర పోషించారు. 2018-19 మధ్యకాలంలో నేను కష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయంలో చాలా మద్దతునిచ్చారు. ఆ తర్వాతే నా ప్రదర్శన మెరుగై నా కెరీర్ గ్రాఫ్ మారింది. వచ్చే నెల 2న RCBతో మ్యాచ్ కోసం ఎదురుచూస్తున్నాను’ అని పేర్కొన్నారు. వేలంలో ఆయన్ను గుజరాత్ దక్కించుకుంది.

News March 20, 2025

భారత్‌కు సొంతంగా బ్రౌజర్!

image

భారత పౌరుల డేటా భద్రత, గోప్యత కోసం సొంతంగా బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ‘సేవల నుంచి ఉత్పత్తుల వైపు మళ్లేందుకు భారత్‌కు ఇదో సదవకాశం. బ్రౌజర్‌కోసం పోటీలు నిర్వహిస్తే విద్యాసంస్థలు, స్టార్టప్‌లు, విద్యార్థులు, పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. మన ప్రజల సమాచారం విదేశీ శక్తుల చేతుల్లో పడకుండా ఉండేందుకే బ్రౌజర్‌ను అభివృద్ధి చేస్తున్నాం’ అని వివరించారు.

News March 20, 2025

రేపటి నుంచే టెన్త్ ఎగ్జామ్స్.. ఏర్పాట్లు పూర్తి

image

TG: రాష్ట్రంలో రేపటి నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. 5.09 లక్షల మంది విద్యార్థులు హాజరుకానుండగా 2,650 కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. ఉ.9.30 నుంచి మ.12.30 వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. 5 నిమిషాలు ఆలస్యమైనా అనుమతిస్తారు. సెంటర్లలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు, మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్‌‌లు తీసుకెళ్లకూడదు.
* ALL THE BEST

error: Content is protected !!