News March 3, 2025
మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.
Similar News
News March 4, 2025
ఆలపాటి రాజా భారీ విజయం

AP: గుంటూరు-కృష్ణా జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజా ఘన విజయం సాధించారు. 50 శాతానికిపైగా ఓట్లు సాధించి విజయం ఖరారు చేసుకున్నారు. ఏడు రౌండ్లు ముగిసేసరికి పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణ్‌పై రాజా 67,252 ఓట్ల మెజారిటీ సాధించారు. మొత్తం 2,41,873 ఓట్లలో 1,18,070 ఓట్లు రాబట్టారు. చెల్లని ఓట్లు 21,577 ఉన్నాయి.
News March 4, 2025
ICC నాకౌట్స్ అంటే హెడ్‌కు పూనకాలే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇవాళ ఇండియా, ఆస్ట్రేలియా మధ్య సెమీస్ జరగనుంది. ఇందులో ఆసీస్ విధ్వంసకర ప్లేయర్ ట్రావిస్ హెడ్ బరిలోకి దిగుతున్నారు. ఆయనకు ఐసీసీ టోర్నీల్లో ఘనమైన రికార్డు ఉంది. భారత్‌తో జరిగిన ODI WC సెమీస్‌లో 62, ఫైనల్లో 137, WTC ఫైనల్లో 163 బాదారు. ఈ మూడు మ్యాచుల్లోనూ ఆయన ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నారు. ఇవాళ భారత్‌తో మ్యాచ్ కాబట్టి హెడ్ చెలరేగే ఆస్కారం ఉంది.
News March 4, 2025
ప్రభాస్ ‘ఫౌజీ’లో విలన్‌గా సన్నీ డియోల్?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ఫౌజీ’ మూవీపై ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో విలన్‌గా బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ఆయన పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని టాక్. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ఈ మూవీలో ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తున్నారు. మరో హీరోయిన్‌గా సాయిపల్లవి నటిస్తారని సమాచారం. విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు.