News March 3, 2025
మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరించిన మాయావతి

BSP చీఫ్ మాయావతి కఠిన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పరిణతి లేదంటూ మేనల్లుడు ఆకాశ్ ఆనంద్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. కాన్షీరాం, అంబేడ్కర్‌ల సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్ మూమెంట్, పార్టీ ప్రయోజనం కోసమే ఈ పని చేశానని తెలిపారు. నెల క్రితం బహిష్కరణకు గురైన అతడి మామ అశోక్ సిద్ధార్థ్ మాటలు ఇప్పటికీ వింటున్నాడని, పార్టీలో వర్గ విబేధాలు సృష్టిస్తున్నాడని ఆరోపించారు. అలాంటి వారికి శిక్ష తప్పదన్నారు.
Similar News
News March 22, 2025
ట్విటర్ ‘పిట్ట’కు భలే ధర

ట్విటర్ పేరు వినగానే ‘పిట్ట’ లోగోనే గుర్తుకొస్తుంది. ఎలాన్ మస్క్ టేకోవర్ చేసుకున్న తర్వాత దాని పేరు, లోగోను Xగా మార్చారు. తర్వాత శాన్‌ఫ్రాన్సిస్కోలోని హెడ్ క్వార్టర్ బిల్డింగ్‌కు 12F పొడవు, 9F వెడల్పు, 254KGల బరువుతో ఉన్న పిట్ట లోగోను తొలగించారు. తాజాగా దాన్ని వేలం వేయగా 34,375 డాలర్లు(రూ.30 లక్షలు) పలికింది. 2006లో దీన్ని 15 డాలర్లతో తయారుచేయించినట్లు పలు కథనాలు వెల్లడిస్తున్నాయి.
News March 22, 2025
దిశా సాలియాన్ డెత్ కేసు: APRIL 2న విచారణ

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ EX మేనేజర్ దిశా సాలియాన్ డెత్ కేసులో ఆమె తండ్రి వేసిన రిట్ పిటిషన్‌ను APRIL 2న విచారిస్తామని బాంబే హైకోర్టు తెలిపింది. 2020, జూన్ 8న తన కుమార్తె మరణించిన తీరుపై మళ్లీ దర్యాప్తునకు ఆదేశించాలని సతీశ్ సాలియాన్ హైకోర్టును ఆశ్రయించడం తెలిసిందే. SSR మృతికీ దీనికీ సంబంధం ఉందని, అప్పటి CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు ఆదిత్య ఠాక్రే సాక్ష్యాలను తారుమారు చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.
News March 22, 2025
SSR-దిశ డెత్ కేసు: మాజీ CM కుమారుడి టెన్షన్

SSR-దిశా సాలియాన్ డెత్ కేసుల్లో మహారాష్ట్ర మాజీ CM ఉద్ధవ్ ఠాక్రే కొడుకు, MLA ఆదిత్య ఠాక్రే చక్రవ్యూహంలో చిక్కుకున్నారు. దిశది సూసైడ్ కాదని, మర్డర్ చేశారని తండ్రి సతీశ్ ఆరోపిస్తున్నారు. 2020, JUNE 8న ఆమె మరణించినప్పుడు తనను కొందరు మెంటల్ కస్టడీలోకి తీసుకొని నోరు మూయించారని చెప్పారు. ఆదిత్యకు కేసుతో సంబంధం ఉందని, ఆయన సాక్ష్యాధారాలను మాయం చేశారని ఆరోపించారు. ఆ రోజు ఎక్కడున్నారో ఆదిత్య చెప్పడం లేదు.