News March 4, 2025
సెమీస్లో ఎదురే లేని టీమ్ ఇండియా

ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో టీమ్ ఇండియాకు అద్భుత రికార్డు ఉంది. గత 27 ఏళ్లుగా ఈ టోర్నీలో జరిగిన సెమీస్లో భారత్ ఓడిపోలేదు. సెమీస్కు వెళ్లిన ప్రతీసారి గెలిచి సగర్వంగా ఫైనల్లో అడుగుపెట్టింది. 2000, 2002, 2013, 2017 సెమీ ఫైనళ్లలో విజయాలు నమోదు చేసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఇవాళ ఆసీస్తో జరగబోయే సెమీ ఫైనల్లోనూ అదే రిపీట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
Similar News
News March 4, 2025
నవరత్న కంపెనీలుగా IRCTC, IRFC

ప్రభుత్వ రంగ సంస్థలైన IRCTC, IRFCలకు నవరత్న హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా సంస్థల ఆర్థిక స్థితిగతులు, ఆదాయ-లాభాల ఆర్జన ఆధారంగా కేంద్రం కంపెనీలకు ఈ హోదా ఇస్తుంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి IRCTC రూ.4270 కోట్ల వార్షిక ఆదాయం, IRFC రూ.26,644 కోట్ల ఆదాయాన్ని సాధించాయి. తాజాగా రెండు కంపెనీలు చేరడంతో ఈ హోదా కలిగిన సంస్థల సంఖ్య 26కు చేరుకుంది.
News March 4, 2025
‘సంక్రాంతికి వస్తున్నాం’ మరో సంచలనం

టీవీలు, ఓటీటీలోకి ‘సంక్రాంతికి వస్తున్నాం’ వచ్చేసినప్పటికీ థియేటర్లలో మూవీ హవా తగ్గలేదు. నేటితో 92 సెంటర్లలో 50 రోజుల రన్ పూర్తిచేసుకుంది. ఒక రీజినల్ మూవీ విభాగంలో ఇది ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే థియేటర్లలో రూ.300 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
News March 4, 2025
ఉద్యోగులను రోబోలనుకున్నారా?: అఖిలేశ్

యువత, ఉద్యోగులు వారానికి 70-90 గంటల పాటు <<15638083>>పనిచేయాలని <<>>కోరుతున్న పారిశ్రామికవేత్తలపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఫైర్ అయ్యారు. ఉద్యోగులను రోబోలుగా భావిస్తున్నారా? అని ప్రశ్నించారు. పనిలో నాణ్యత ముఖ్యమని పేర్కొన్నారు. ఎక్కువ గంటలు పనిచేయాలంటున్న వారు యువకులుగా ఉన్నప్పుడు అన్ని గంటలు పనిచేశారా? అని నిలదీశారు. పని గంటల పొడిగింపుతో కలిగే ఆర్థిక ప్రగతి సామాన్యులకు ఏం ఒరగబెడుతుందని ప్రశ్నించారు.