News March 4, 2025
నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Similar News
News March 4, 2025
జగన్ ప్రభుత్వం పోలవరాన్ని నిలిపేసింది: మంత్రి నిమ్మల

AP: పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.
News March 4, 2025
ICAI పరీక్షా ఫలితాల విడుదల

సీఏ ఇంటర్మీడియట్ కోర్సు ఫలితాలను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్ ఆఫ్ ఇండియా(ICAI) ఈరోజు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ నంబర్, రోల్ నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ అందుబాటులోకి వస్తాయి. ఈ ఏడాది జనవరిలో 11, 13, 15, 17, 19, 21 తేదీల్లో ఈ పరీక్షను నిర్వహించారు. ఫలితాల కోసం ఇక్కడ <
News March 4, 2025
వారికి ప్రభుత్వ పథకాలు కట్?

AP: గంజాయి, డ్రగ్స్ రవాణా, వినియోగాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మాదకద్రవ్యాల కేసుల్లో పట్టుబడిన వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలను నిలిపేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధమైనట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. త్వరలోనే క్యాబినెట్‌లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిపాయి.