News March 4, 2025

నేడు మంగళగిరికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి రానున్నారు. నామినేటెడ్ పదవులు, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై పార్టీ ముఖ్యనేతలతో ఆయన చర్చించనున్నారు. ఈ సమావేశంలో పార్టీ బలోపేతానికి అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంది. పార్టీ కార్యకర్తలను ప్రోత్సహించేందుకు మరిన్ని కార్యక్రమాలు అమలు చేయనున్నట్లు సమాచారం. ఎమ్మెల్యే కోటా MLC అభ్యర్థులపైనా చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Similar News

News March 24, 2025

BREAKING: మంత్రి వర్గ విస్తరణకు ఓకే!

image

TG: ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో తెలంగాణ నేతల భేటీ ముగిసింది. మంత్రి వర్గ విస్తరణకు పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 4 మంత్రి పదవులను భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఉగాది రోజున ప్రకటన వెలువడే అవకాశముంది. దీంతో పాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది.

News March 24, 2025

కంగ్రాట్స్ రాజీవ్.. మళ్లీ కత్తి దూసేందుకు సిద్ధం: శశి థరూర్

image

BJP కేరళ ప్రెసిడెంట్‌గా ఎన్నికైన రాజీవ్ చంద్రశేఖర్‌కు కాంగ్రెస్ నేత, ఎంపీ శశి థరూర్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరోసారి కత్తులు దూసేందుకు ఎదురు చూస్తున్నానని సరదాగా కామెంట్ చేశారు. వేర్వేరు పార్టీలైనప్పటికీ కొన్ని రోజులుగా వీరిద్దరూ కొన్ని అంశాలపై ఒకే రకమైన వాయిస్ వినిపిస్తున్నారు. 2024 LS ఎన్నికల్లో తిరువనంతపురంలో నువ్వానేనా అన్నట్టు జరిగిన పోటీలో రాజీవ్‌పై శశి 15వేల ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు.

News March 24, 2025

అరటి రైతులకు రూ.1.10 లక్షలు: అచ్చెన్న

image

AP: వడగండ్ల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. అనంతపురం, సత్యసాయి, కడప, ప్రకాశం జిల్లాల్లో అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారని చెప్పారు. త్వరలోనే మిగిలిన జిల్లాల్లో ప్రక్రియ మొదలవుతుందన్నారు. అరటి రైతులకు హెక్టారుకు రూ.35,000 ఇన్‌పుట్ సబ్సిడీ, మొక్కలు నాటుకునేందుకు అదనంగా మరో రూ.75వేలు అందజేస్తామని ప్రకటించారు. మొత్తంగా రూ.1.10 లక్షలు సాయం చేస్తామన్నారు.

error: Content is protected !!