News March 22, 2024

పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

image

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.

Similar News

News November 4, 2025

రేపు గురుపూర్ణిమ.. సెలవు

image

రేపు (బుధవారం) గురుపూర్ణిమ/గురునానక్ జయంతి సందర్భంగా తెలంగాణలో పబ్లిక్ హాలిడే ఉంది. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు ఈ సెలవు వర్తించనుంది. అటు ఏపీలో అకడమిక్ క్యాలెండర్ ప్రకారం రేపు సెలవు లేదు. ఆప్షనల్ హాలిడే మాత్రమే ఇచ్చారు.

News November 4, 2025

మనం కూడా న్యూక్లియర్ టెస్టులు చేయాల్సిందేనా?

image

చైనా, పాకిస్థాన్ <<18185605>>న్యూక్లియర్<<>> వెపన్ టెస్టులు చేస్తున్నాయని ట్రంప్ చెప్పడం భారత్‌కు ఆందోళన కల్గించే విషయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 1998 నుంచి భారత్ అణుపరీక్షలు జరపలేదు. 2025 నాటికి మన దగ్గర 180 వార్‌హెడ్స్ ఉంటే.. చైనాలో 600, పాకిస్థాన్‌లో 170 ఉన్నాయి. త్వరలో పాక్ 200, చైనా 1,000కి చేరే అవకాశం ఉంది. దీంతో భారత్ న్యూక్లియర్ టెస్టులు ప్రారంభించాలనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

News November 4, 2025

నెత్తుటి రహదారి.. 200 మందికి పైగా మృతి

image

TG: నిన్న <<18186227>>ప్రమాదం<<>> జరిగిన హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి(NH-163)ని రాకాసి రహదారిగా పేర్కొంటున్నారు. ఈ మార్గంలోని 46 కి.మీ. రహదారిపై ఎక్కడపడితే అక్కడే గుంతలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. 2018 నుంచి చోటు చేసుకున్న ప్రమాదాల్లో 200 మందికి పైగా మరణించగా సుమారు 600 మంది గాయాలపాలయ్యారు. తాజాగా అన్ని అడ్డంకులు తొలిగి రోడ్డు విస్తరణ పనులకు మోక్షం కలగడంతో పనులు ప్రారంభం కానున్నాయి.