News March 22, 2024
పెస్టిసైడ్స్‌తో వణుకుడు రోగం

ప్రస్తుత రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంతోమంది పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో మనిషి శరీర భాగాల్లో వణుకు మొదలవుతుంది. కాగా ఈ వ్యాధికి పెస్టిసైడ్స్ ఓ కారణమని పరిశోధకులు తేల్చారు. అట్రాజైన్, లిండేన్, సిమేజైన్ వంటి 14 రకాల క్రిమిసంహారక మందుల ద్వారా ఈ వ్యాధి ప్రబలుతోందని తెలిపారు. వ్యవసాయ క్షేత్రాల్లో పని చేసేవారు, ఆయా పరిసర ప్రాంతాల్లో ఉండేవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే ప్రమాదం ఉందట.
Similar News
News April 16, 2026
కరోండా(వాక్కాయ)ను ఎలా, ఎప్పుడు నాటాలి?

వర్షాకాలంలో కరోండా(వాక్కాయ)ను నాటితే బాగా పెరుగుతుంది. పొలానికి చుట్టూ ప్రతి 1 మీటరు దూరంలో ఒక మొక్క నాటాలి. మొదటి రెండేళ్లలో మొక్కలకు నీరు పోయడం, ఎరువులు వేయడం అవసరం. మూడో ఏడాది నుంచే ఇది సహజమైన జీవకంచెగా మారిపోతుంది. ఎప్పటికప్పుడు పొదలను కొంచెం కత్తిరించి సమానంగా పెంచితే కంచె మరింత బలంగా మారి పంటకు రక్షణగా నిలుస్తుంది. అలాగే ఈ వాక్కాయ పండ్లను అమ్మి రైతులు అదనపు ఆదాయాన్ని పొందవచ్చు.
News April 16, 2026
మహిళలకు ఈ క్యాన్సర్ల ముప్పు ఎక్కువ

మహిళలకు వచ్చే క్యాన్సర్ వ్యాధుల్లో సర్వైకల్ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్ మొదటిస్థానంలో ఉంటుంది. దీని తర్వాత స్థానం రొమ్ము క్యాన్సర్. వీటితోపాటు యూట్రస్ క్యాన్సర్, అండాశయ (ఓవేరియన్) క్యాన్సర్ కూడా ఎక్కువగా వస్తున్నాయి. రొమ్ము క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్ వ్యాధులు వంశపారంపర్యంగా వస్తాయి. వీటిని రాకుండా ఆపలేం కానీ, రాకముందే గుర్తించి అప్రమత్తమై చికిత్స చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు.
News April 16, 2026
మహిళల్లో క్యాన్సర్ ముప్పును పెంచే అలవాట్లు

సిగరెట్లు, మద్యం తాగే మహిళలకు, పురుషుల కంటే క్యాన్సర్, గుండె జబ్బుల ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. పొగాకులోని హానికారకాలకు మహిళల్లోని ఈస్ట్రోజెన్, ఇతర హార్మోన్లు, ఎంజైమ్‌లు స్పందించే తీరు భిన్నంగా ఉంటుందని ఇది క్యాన్సర్ కారకంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు గుండె జబ్బులు, ఎంఫిసెమా, ఇతర తీవ్రమైన అనారోగ్యాల ముప్పును కూడా పెంచుతుంది.


