News March 4, 2025

IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

image

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్‌సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.

Similar News

News April 18, 2026

సోమవారం రెండో విడత శాంతి చర్చలు!

image

అమెరికా-ఇరాన్ రెండో విడత శాంతి చర్చలకు సిద్ధమయ్యాయి. అందుకు మరోసారి పాకిస్థాన్‌ను వేదికగా ఎంచుకున్నాయి. ఇస్లామాబాద్‌లో వచ్చే సోమవారం చర్చలు జరపనున్నట్లు సమాచారం. రేపు ఇరాన్ ప్రతినిధులు పాక్ చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తొలి విడత చర్చలు విఫలమైన విషయం తెలిసిందే.

News April 18, 2026

పెరిగిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.810 పెరిగి రూ.1,55,780కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.750 పెరిగి రూ.1,42,800గా ఉంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.5000 ఎగసి రూ.2,80,000కి చేరింది.

News April 18, 2026

IPLలో అన్‌సక్సెస్‌ఫుల్ కెప్టెన్ ఇతడే..

image

IPL చరిత్రలో 25+ మ్యాచులకు నాయకత్వం వహించి అతి తక్కువ విన్నింగ్ పర్సంటేజ్(31.8%) కలిగిన కెప్టెన్‌గా అజింక్య రహానే నిలిచారు. ఆయన 44 మ్యాచులకు కెప్టెన్సీ చేయగా 14సార్లు మాత్రమే గెలిచారు. ఆయన తర్వాతి స్థానాల్లో జయవర్ధనే(33.3%), సంగక్కర (36.2%), ధవన్ (37%), గంగూలీ(40.5%) ఉన్నారు. కాగా ప్రస్తుత సీజన్‌లో రహానే కెప్టెన్సీలో KKR ఇప్పటివరకు 6 మ్యాచులు ఆడగా ఐదింట్లో ఓడింది. ఒక మ్యాచ్ రద్దయింది.