News March 4, 2025

IT బిజినెస్ మోడల్ పనైపోయింది: HCL టెక్ CEO

image

భారత ఐటీ ఇండస్ట్రీ 30 ఏళ్లుగా అనుసరిస్తున్న సంప్రదాయ బిజినెస్ మోడల్ పనైపోయిందని HCL టెక్ CEO విజయ్ కుమార్ ప్రకటించారు. AI విజృంభణతో ఈ మోడల్ పాతబడిందని పేర్కొన్నారు. భవిష్యత్తుకు తగినట్టు ఉండాలన్నా, మెరుగైన వృద్ధి కావాలన్నా కంపెనీల మైండ్‌సెడ్ మారాలని స్పష్టం చేశారు. AIని వాడుకొని ప్రొడక్షన్ పెంచాలని, సగం ఉద్యోగులతోనే రెట్టింపు రెవెన్యూ సృష్టించాలని తమ టీమ్స్‌ను సవాల్ చేస్తున్నామని తెలిపారు.

Similar News

News March 24, 2025

ఇవాళ మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ వెళ్లనున్నారు. అధిష్ఠానం నుంచి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పెద్దలకు పిలుపు వచ్చింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మహేశ్ గౌడ్, తదితరులు హస్తినకు బయల్దేరనున్నారు. ఈ సాయంత్రం కేసీ వేణుగోపాల్‌తో వీరందరూ భేటీ కానున్నారు. రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణ, తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

News March 24, 2025

పార్లమెంట్ ప్రాంగణంలో అరకు కాఫీ స్టాళ్ల ఏర్పాటు

image

దేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రెండు అరకు కాఫీ స్టాళ్లు ఏర్పాటయ్యాయి. అక్కడ ఎంపీలు అల్పాహారం తీసుకునే సంగం క్యాంటీన్‌లో గిరిజన కోఆపరేటివ్ సొసైటీ వీటిని ఏర్పాటు చేసింది. అరకు కాఫీకి బ్రాండ్ ఇమేజ్ తేవాలని AP సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు TDP ఎంపీలు కోరగా లోక్‌సభ స్పీకర్ అనుమతి ఇచ్చారు. ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ అరకు కాఫీ స్టాల్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే.

News March 24, 2025

కాస్త తగ్గిన బంగారం ధరలు

image

బంగారం ధరలు కాస్త తగ్గాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.150 తగ్గి రూ.82,150 వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.160 తగ్గడంతో రూ.89,620కు చేరింది. అటు వెండి ధర కూడా రూ.100 తగ్గడంతో కేజీ సిల్వర్ రేటు రూ.1,09,900గా ఉంది. కాగా, మూడు రోజుల్లోనే 24 క్యారెట్ల తులం బంగారంపై రూ.1040 తగ్గడం గమనార్హం.

error: Content is protected !!