News March 22, 2024

అమరావతిని నం.1గా తీర్చిదిద్దుతాం: లోకేశ్

image

AP: రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తే అమరావతిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్ చెప్పారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే.. మంగళగిరి MLA ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. TDP-జనసేన-BJP కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రతి ప్రాంతానికి సురక్షిత నీటిని అందిస్తామని హామీనిచ్చారు.

Similar News

News November 26, 2024

DEC 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్

image

TG: ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ డిసెంబర్ 7న ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని డ్రైవర్స్ యూనియన్ పేర్కొంది. ఈ మేరకు RTA జాయింట్ కమిషనర్‌కు సమ్మె పత్రాన్ని యూనియన్ సభ్యులు అందజేశారు. సంక్షేమ బోర్డు ఏర్పాటు, మీటర్ ఛార్జీల పెంపు, కొత్త పర్మిట్లు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, యాక్సిడెంట్ బీమా రూ.10 లక్షలకు పెంపు, డ్రైవర్లకు ఏటా రూ.12 వేలా ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.

News November 26, 2024

ఢిల్లీ క్యాపిటల్స్‌కు శ్రీకాకుళం కుర్రాడు.. కేంద్ర మంత్రి విషెస్

image

AP: శ్రీకాకుళం జిల్లా‌కు చెందిన త్రిపురాణ విజయ్ ఐపీఎల్‌లో చోటు దక్కించుకోవడంపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అభినందనలు తెలిపారు. విజయ్ ప్రయాణం చాలా మందికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కొత్త అధ్యాయంలో విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు Xలో రాసుకొచ్చారు. కాగా విజయ్‌ను రూ.30 లక్షల బేస్ ప్రైజ్ చెల్లించి ఢిల్లీ క్యాపిటల్స్ కొనుగోలు చేసింది.

News November 26, 2024

IPL: మెగావేలంలో ఫ్రాంచైజీలు ఎంత ఖర్చు చేశాయంటే?

image

ఐపీఎల్ మెగావేలంలో 10 ఫ్రాంచైజీలు రూ.639.15 కోట్లు ఖర్చు చేశాయి. మొత్తం 182 మంది ప్లేయర్లు వేలంలో అమ్ముడుపోగా వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్లు ఉన్నారు. మొత్తం 8 మంది ఆటగాళ్లను RTM ద్వారా ఆయా జట్లు దక్కించుకున్నాయి. అత్యధికంగా పంజాబ్ 23 మంది ప్లేయర్లను కొనుగోలు చేయగా, అత్యల్పంగా రాజస్థాన్ రాయల్స్ 14 మందిని వేలంలో దక్కించుకుంది. ఇంకా ఆర్సీబీ వద్ద అత్యధికంగా రూ.75 లక్షలు మిగిలి ఉన్నాయి.