News March 22, 2024
అమరావతిని నం.1గా తీర్చిదిద్దుతాం: లోకేశ్

AP: రాబోయే ఎన్నికల్లో తమను గెలిపిస్తే అమరావతిని దేశంలోనే నం.1గా తీర్చిదిద్దుతామని నారా లోకేశ్ చెప్పారు. ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని లక్ష్యంతో చంద్రబాబు అమరావతిని అభివృద్ధి చేస్తే.. మంగళగిరి MLA ఆర్కే కేసులు వేసి అడ్డుకున్నారని మండిపడ్డారు. TDP-జనసేన-BJP కూటమి అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. ప్రతి ప్రాంతానికి సురక్షిత నీటిని అందిస్తామని హామీనిచ్చారు.
Similar News
News March 11, 2026
పొట్టను దాస్తూ అలసిపోయా.. తగ్గి చూపిస్తా: KTR

TG: BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జిమ్‌లో కసరత్తు చేస్తున్న ఫొటోను Xలో షేర్ చేశారు. తన పొట్టను దాస్తూ అలసిపోయానని, 6 నెలల విరామం తర్వాత మళ్లీ జిమ్‌లో కసరత్తు మొదలుపెట్టానని ఆయన రాసుకొచ్చారు. జులైలో తనకు 50 ఏళ్లు రానున్నాయని, ఆ నాటికి స్లిమ్‌గా మారతానంటూ ధీమా వ్యక్తం చేశారు. కాగా విజయ్ దేవరకొండ రిసెప్షన్‌లో కేటీఆర్ తన పొట్టను దాస్తూ సరదాగా కామెంట్ చేసిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే.
News March 11, 2026
20 నెలల్లో సూపర్ సిక్స్ సూపర్ హిట్: CBN

AP: 20 నెలల్లో సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశామని సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో కలెక్టర్ల సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘సూపర్ సిక్స్‌తో పాటు ఇతర పథకాలూ అమలు చేశాం. ఎక్కడా చిన్న తప్పు లేకుండా ముందుకెళ్తున్నాం. ఉగాది కానుకగా అన్నదాత సుఖీభవ, 2.50 లక్షల గృహప్రవేశాలు చేయిస్తున్నాం. అభివృద్ధి చేయాలంటే అనేక అవకాశాలు ఉన్నాయి. ఫర్వాలేదు అనే ఉదాసీనత ఉంటే ముందుకు వెళ్లలేం’ అని తెలిపారు.
News March 11, 2026
VASTHU: ఇంట్లో ఫొటో ఫ్రేమ్స్ ఏ దిశలో పెట్టాలంటే?

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో దంపతులు/కుటుంబ సభ్యుల ఫొటోలను నైరుతి దిశలో ఉంచడం శ్రేయస్కరమని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఇది బంధాలను బలోపేతం చేస్తుందని చెబుతున్నారు. ‘స్నేహితులతో దిగిన, విజయాలకు సంబంధించిన ఫొటోలు తూర్పు, ఉత్తర దిశల్లో ఉంచాలి. తద్వారా కీర్తి, పురోగతి లభిస్తాయి. సరైన దిశలో అమర్చిన ఫొటోలు ఇంట్లో సానుకూల శక్తిని నింపి, ఆర్థికంగా, ఆరోగ్యంగా అదృష్టాన్ని తెచ్చిపెడతాయి’ అంటున్నారు.


