News March 5, 2025

SBI కస్టమర్లకు హెచ్చరిక

image

తమ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలకు సంబంధించి తమ కస్టమర్లను SBI హెచ్చరించింది. పెట్టుబడులకు సంబంధించి SBI పేరుతో సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్న వీటిని నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దని సూచించింది. SBI ఎప్పుడూ ఇలాంటి వీడియోలు షేర్ చేయదని స్పష్టం చేసింది. AI ఉపయోగించి ఇలాంటి వీడియోలు, వాయిస్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.

Similar News

News March 27, 2026

అమరావతిలో మంటలు.. సెక్యూరిటీ గార్డే నిందితుడు?

image

AP: <<19480669>>అమరావతిలో<<>> పైపుల దహనం కేసులో మిస్టరీ వీడినట్లు తెలుస్తోంది. సూపర్‌వైజర్‌పై కోపంతో సెక్యూరిటీ గార్డు రాము నిప్పంటించినట్లు సమాచారం. రోజూ 12 గంటల డ్యూటీ, సెలవు ఇవ్వకపోవడంతో రాము కొన్నిరోజులుగా కోపంతో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏదైనా పెద్ద ఘటన జరిగితేనే ఎక్కువ మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుంటారని మంటలు పెట్టినట్లు తెలుస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారిస్తున్నారు.

News March 27, 2026

మహిళల ఆహారంలో ఉండాల్సిన పోషకాలివే..

image

ఒక మహిళ అమ్మగా, భార్యగా, ఉద్యోగినిగా, నాయకురాలిగా ఎన్నో పాత్రలు పోషించాల్సి ఉంటుంది. అందుకే ఆమె ఆరోగ్యం పై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు. మహిళల ఆహారంలో కచ్చితంగా ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి, విటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియం ఉండేలా చూసుకోవాలంటున్నారు. వీటికోసం నట్స్, పాలకూర, ఓట్స్, పాల ఉత్పత్తులు, గుమ్మడి గింజలు, అవకాడో ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.

News March 27, 2026

అధిక పాలిచ్చే పశువుకు ఉండే లక్షణాలు

image

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.