News March 5, 2025
SBI కస్టమర్లకు హెచ్చరిక

తమ పేరుతో సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న డీప్‌ఫేక్ వీడియోలకు సంబంధించి తమ కస్టమర్లను SBI హెచ్చరించింది. పెట్టుబడులకు సంబంధించి SBI పేరుతో సైబర్ నేరగాళ్లు షేర్ చేస్తున్న వీటిని నమ్మి ఇన్వెస్ట్ చేయొద్దని సూచించింది. SBI ఎప్పుడూ ఇలాంటి వీడియోలు షేర్ చేయదని స్పష్టం చేసింది. AI ఉపయోగించి ఇలాంటి వీడియోలు, వాయిస్‌లతో ప్రజలను మోసం చేస్తున్నారని జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News December 12, 2025
రెండో విడత ప్రచారానికి తెర

TGలో రెండో విడత ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీల్లో ప్రచారం ముగిసింది. ఎల్లుండి పోలింగ్ జరగనుంది. రెండో విడతలో 4,333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. 12 వేలకుపైగా నామినేషన్లు దాఖలయ్యాయి. పోలింగ్‌కు అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఫలితాలు వెల్లడిస్తారు.
News December 12, 2025
‘అఖండ-2’ సీక్వెల్ ఉంటుందా?

నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ-2’ చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజవ్వగా థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్ ఉంటుందని మేకర్స్ హింట్ ఇచ్చారు. ఎండ్ కార్డ్‌లో ‘జై అఖండ’ అనే టైటిల్ పోస్టర్ ఇవ్వడంతో సీక్వెల్‌పై చర్చ మొదలైంది. కాగా ఈ చిత్ర ఓటీటీ రైట్స్‌ను దక్కించుకున్న ‘నెట్‌ఫ్లిక్స్’లో త్వరలో ‘అఖండ-2’ స్ట్రీమింగ్ కానుంది. మూవీ చూసిన వారు ఎలా ఉందో కామెంట్ చేయండి.
News December 12, 2025
చిన్నస్వామిలో IPL మ్యాచ్‌లకు లైన్ క్లియర్!

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మళ్లీ IPL మ్యాచ్‌లు నిర్వహించేందుకు రూట్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది. జస్టిస్ డీకున్హా కమిషన్ సూచించిన భద్రతా సిఫార్సులు అమలు చేస్తే మ్యాచ్‌లకు అనుమతి ఇవ్వాలని కర్ణాటక క్యాబినెట్ నిర్ణయించింది. తొక్కిసలాట ఘటన అనంతరం స్టేడియం భద్రతాపరంగా అనుకూలం కాదని నివేదిక తేల్చడంతో పెద్ద ఈవెంట్లు నిలిచిపోయాయి. ప్రస్తుతం స్టేడియం పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.


