News March 5, 2025
బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారా?

HYDలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు రోడ్లపై చెత్త వేసే వారు, బహిరంగ మూత్ర విసర్జన చేసే వారికి GHMC జరిమానా (₹100) విధించనుంది. గోడలపై రాతలు, కాలువల్లో చెత్త వేస్తే ₹1000, దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే ₹1000-₹2000, అనుమతి లేకుండా గోడలపై పోస్టర్లు అంటిస్తే ₹2వేలు, బ్యానర్లు, కటౌట్లకు రూ.5వేలు ఇలా 19 రకాల ఉల్లంఘనలకు ₹50వేల వరకు ఫైన్ వేయనుంది. దీని కోసం ఒక యాప్‌ను రూపొందిస్తోంది.
Similar News
News March 12, 2026
విద్యార్థుల అకౌంట్లలో డబ్బులు జమ

TG: రాష్ట్రంలో పోస్ట్ మెట్రిక్ చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2024-25కు గాను స్కాలర్‌షిప్స్, ట్యూషన్ ఫీజు కింద వారి ఖాతాల్లో రూ.374 కోట్లు జమ చేసింది. ఇందులో కేంద్రం వాటా రూ.201 కోట్లు, రాష్ట్రం వాటా రూ.173 కోట్లు. ఈ మొత్తంతో 83,239 మంది స్టూడెంట్లకు లబ్ధి చేకూరింది.
News March 12, 2026
ఈ మొక్కల్ని నాటితే..

వృక్షాలు మానవుడిని నరక ప్రాయం నుంచి రక్షిస్తాయని వరాహ పురాణం పేర్కొంది. రావి, వేప, మర్రి, దానిమ్మ, మామిడి వంటి పండ్ల చెట్లతో పాటు 10 పూల మొక్కలను నాటితే వారు నరకానికి వెళ్లరని శాస్త్ర వచనం. మనం పెంచే మొక్కలే మరుజన్మలో మనకు సంతానంగా మారుతాయని, వృక్షాలకు కూడా సుఖదుఃఖాలు ఉంటాయని, వాటిని నరకడం పాపమని మనుస్మృతి హెచ్చరిస్తోంది. కాబట్టి మన సంతోషం కోసం, లోక కళ్యాణం కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించాలి.
News March 12, 2026
పారిశ్రామిక హబ్‌గా ఏపీ: సీఎం చంద్రబాబు

AP: వైసీపీ ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదని సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఉన్న కంపెనీలు కూడా పారిపోయే పరిస్థితి చూశామని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని పారిశ్రామిక హబ్‌గా మార్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామన్నారు. కలెక్టర్ల సదస్సులో మాట్లాడుతూ ‘అభివృద్ధి కోసం ఏ చిన్న ప్రయత్నం చేసినా దీర్ఘకాలంలో వాటి ఫలితాలను చూస్తాం’ అని పేర్కొన్నారు.


