News March 5, 2025
BRS పొరపాటు వల్లే రైతులకు ఇబ్బందులు: మంత్రి ఉత్తమ్

కృష్ణా, గోదావరి జలాల్లో BRS చేసిన పొరపాటు వల్ల రైతులకు ఇబ్బందులు వస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. హరీశ్ రావు తప్పుడు ఆరోపణలు మానుకోవాలని సూచించారు. ‘ఖరీఫ్‌లో ఉమ్మడి AP కంటే ఎక్కువ వరి TGలో పండింది. రబీలో 56L ఎకరాల పైగానే సాగు జరుగుతోంది. తక్కువ నీటిని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నాం. APకి BRS ధారాదత్తంగా నీటిని వదిలిపెట్టింది. మేం అధికారంలోకి వచ్చాక రూల్స్ మార్చాలని ఒత్తిడి తెచ్చాం’ అని తెలిపారు.
Similar News
News January 7, 2026
T20 WCకు న్యూజిలాండ్ జట్టు ప్రకటన

వచ్చే నెల భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న T20 వరల్డ్ కప్‌కు న్యూజిలాండ్ 15 మందితో జట్టును ప్రకటించింది. శాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: శాంట్నర్(C), ఫిన్ అలెన్, బ్రేస్‌వెల్, చాప్మన్, కాన్వే, డఫీ, ఫెర్గూసన్, హెన్రీ, మిల్నే, మిచెల్, నీషమ్, ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, సీఫర్ట్, సోధి.
– మరోవైపు ఈ నెల 11 నుంచి భారత్‌తో న్యూజిలాండ్ 3 వన్డేలు, 5 T20ల సిరీస్‌లు ఆడేందుకు ఇండియా రానుంది.
News January 7, 2026
కరువు కాస్తయినా గాభరా లావు

కరువు కాలంలో మనకు దొరికేది తక్కువైనా.. ఆకలి, భవిష్యత్తు గురించి ఉండే భయం(గాభరా) మాత్రం చాలా ఎక్కువగా (లావుగా) ఉంటుంది. సాధారణంగా ఏదైనా కొరత ఏర్పడినప్పుడు, ఆ సమస్య కంటే దాని వల్ల కలిగే ఆందోళనే మనిషిని ఎక్కువగా వేధిస్తుందని ఈ మాట చెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వర్షాలు లేక పంటలు పండనప్పుడు రైతుల ఆవేదనను ఈ సామెత ప్రతిబింబిస్తుంది.
News January 7, 2026
అమ్మాయిలకు త్వరగా పెళ్లి కావాలంటే..

స్త్రీ జాతకంలో వివాహానికి కారకుడు గురువు. గురు బలం లేకపోతే ఎంత ప్రయత్నించినా సంబంధాలు నిశ్చయమవ్వవు. గురు గ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం రాఘవేంద్ర స్వామిని లేదా దత్తాత్రేయుని దర్శించుకోవాలి. గురువారం నాడు పసుపు రంగు వస్త్రాలు ధరించడం, శనగలు దానం చేయడం మంచిది. ‘ఓం బృహస్పతయే నమః’ అనే మంత్రాన్ని జపిస్తూ మేధా దక్షిణామూర్తిని పూజిస్తే జాతకంలో దోషాలు తొలగి, యోగ్యుడైన వరుడితో వివాహం నిశ్చయమవుతుంది.


